అందరితో శభాష్ అనిపించుకోవాలి.. కొడుకులపై బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్‌లో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. తన పిల్లల విషయంలో మాత్రం ఎప్పుడూ ఓ తండ్రిగానే కనిపిస్తుంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 31 Aug 2026 5:27 PM ISTటాలీవుడ్‌లో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. తన పిల్లల విషయంలో మాత్రం ఎప్పుడూ ఓ తండ్రిగానే కనిపిస్తుంటారు. సినిమా రంగానికి సంబంధించిన విషయాలతో తరచూ వార్తల్లో నిలిచే ఆయన.. తాజాగా తన ఇద్దరు కొడుకులు హితేష్ బండ్ల, హిరేష్ బండ్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ పోస్ట్‌లో కేవలం బర్త్‌డే విషెస్ మాత్రమే కాకుండా.. తన కొడుకుల ఫ్యూచర్ పై ఓ తండ్రిగా తనకున్న ఆశయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
మీకు ఇష్టమైన రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి, మీ టాలెంట్‌తో, మీ కష్టంతో అందరి చేత శభాష్ అనిపించుకునే స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నానంటూ బండ్ల గణేష్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. సాధారణంగా సెలబ్రిటీ కుటుంబాలకు సంబంధించిన పోస్టుల్లో పేరు, డబ్బు, హోదా వంటి అంశాలే హైలైట్ అవుతుంటాయి.
కానీ గణేష్ తన కొడుకులకు ఇచ్చిన సందేశంలో మాత్రం కష్టపడి, తమ టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకోవాలనే విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించడం ఆసక్తిని కలిగిస్తోంది. అంతేకాదు.. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలు ఎప్పుడూ వారి వెంట ఉండాలని కోరుకుంటూ ఏడుకొండలవాడిని ప్రార్థిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్‌లో ఓ తండ్రి తన పిల్లలపై పెట్టుకున్న ప్రేమ, ఆశలు రెండూ కనిపిస్తున్నాయంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఇక బండ్ల గణేష్ పిల్లలపై సోషల్ మీడియాలో ఆసక్తి పెరగడానికి మరో కారణం ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఫ్యామిలీ సెలబ్రేషన్స్. ఆయన కూతురు జనని పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ లో హిరేష్ బండ్ల చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సాంగ్ తో పాటు రామ్ చరణ్ సాంగ్ కు కూడా హిరేష్ స్టెప్పులు వేయడం కూడా వైరలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొడుకు డ్యాన్స్ చూసి బండ్ల గణేష్ ఎమోషనల్ అయినట్లు వచ్చిన వీడియోలు తండ్రీ కొడుకుల అనుబంధాన్ని మరింతగా హైలైట్ చేశాయి. ఇలా కుటుంబ వేడుకల సమయంలోనూ, సోషల్ మీడియా పోస్టుల ద్వారానూ బండ్ల గణేష్ పిల్లలు నెటిజన్ల దృష్టిలోకి వస్తున్నారు. సాధారణంగా సినీ ప్రముఖుల వారసుల పర్సనల్ లైఫ్, వారి టాలెంట్, వారి ఇంట్రెస్ట్‌లపై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి ఉంటుంది. అదే ఇప్పుడు హితేష్, హిరేష్ విషయంలోనూ కనిపిస్తోంది.
