బండ్ల దీపావళి పార్టీ.. కొత్త ట్రెండ్ కోసం ఎంత ఖర్చు చేశారంటే?
దీపావళి పండగ అనగానే మనకు గుర్తొచ్చేది దీపాలు, టపాసులు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం దీనికి అదనంగా గ్రాండ్ పార్టీలు కూడా ఉంటాయి.
By: M Prashanth | 19 Oct 2025 11:36 AM ISTదీపావళి పండగ అనగానే మనకు గుర్తొచ్చేది దీపాలు, టపాసులు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం దీనికి అదనంగా గ్రాండ్ పార్టీలు కూడా ఉంటాయి. కరణ్ జోహార్ నుంచి షారుక్ ఖాన్ వరకు, స్టార్ల ఇళ్లన్నీ అతిథులతో కళకళలాడిపోతాయి. ఇన్నాళ్లుగా మన టాలీవుడ్‌లో ఆ కల్చర్ పెద్దగా కనిపించలేదు. అయితే, ఈ ఏడాది ఆ లోటును తీరుస్తూ, బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ టాలీవుడ్‌లో ఒక సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
సినిమా ఈవెంట్లలో తన స్పీచ్‌లతో సెన్సేషన్ క్రియేట్ చేసే బండ్ల గణేష్, ఈసారి తన గ్రాండ్ పార్టీతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన ఇంటి వైపు చూసేలా చేశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వేడుక, టాలీవుడ్ తారలతో కిటకిటలాడింది. కొంతకాలంగా నిర్మాతగా యాక్టివ్‌గా లేనప్పటికీ, బండ్ల గణేష్ ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడిని, బంధాలను ఈ ఒక్క పార్టీతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.
ఈ స్టార్ స్టడెడ్ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై, వేడుకకే ప్రత్యేక కళను తీసుకొచ్చారు. వీరితో పాటు యంగ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, దర్శకుడు హరీష్ శంకర్, నటుడు శ్రీకాంత్, మౌళి, అనిల్ రావిపూడి, మైత్రి నవీన్ వంటి ఎందరో ప్రముఖులు ఈ బాష్‌లో సందడి చేశారు. బండ్ల తన దేవుడు పవన్ కళ్యాణ్‌ను కూడా ఆహ్వానించినట్లు తెలిసినా, ఆయన హాజరయ్యారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.
ఇక పార్టీ కోసం బండ్ల గణేష్ పెట్టిన ఖర్చు గురించి వినిపిస్తున్న లెక్కలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం కొన్ని గంటల పార్టీ కోసం ఆయన ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారని టాక్. మరింత షాకింగ్ విషయం ఏంటంటే, పార్టీలో ఒక్కో డిన్నర్ ప్లేట్ ఖరీదు సుమారు రూ.15,000 అట. ఈ లెక్కలు చూస్తుంటే, పార్టీ ఏ రేంజ్‌లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు ఇలాంటి గ్రాండ్ దీపావళి బాష్‌లు బాలీవుడ్‌కే పరిమితం. మన స్టార్స్ అక్కడి పార్టీలకు వెళ్లడం చూశాం కానీ, మన దగ్గర ఈ రేంజ్‌లో ఒక సెలబ్రేషన్ జరగడం ఇదే మొదటిసారి. ఈ పార్టీ కేవలం టాలీవుడ్ ప్రముఖులకే కాకుండా, బండ్ల గణేష్‌కు సన్నిహితంగా ఉండే రాజకీయ, వ్యాపార వర్గాల వారికి కూడా వేదికైంది. మొత్తం మీద, బండ్ల గణేష్ తనదైన స్టైల్‌లో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. మాటలతోనే కాదు, చేతలతో కూడా తాను ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లోనే ఉంటానని బండ్ల మరోసారి నిరూపించుకున్నారు. ఈ గ్రాండ్ పార్టీ, రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మరిన్ని ఇలాంటి వేడుకలకు నాంది పలుకుతుందేమో చూడాలి.
