Begin typing your search above and press return to search.

బండ్ల గణేష్ పార్టీ చేయడానికి అసలు కారణమిదేనా?

ఇప్పటికే బాలీవుడ్ లో ఉన్న దీపావళి పార్టీ కల్చర్ ను ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ట్ చేశారు.

By:  M Prashanth   |   19 Oct 2025 1:20 PM IST
బండ్ల గణేష్ పార్టీ చేయడానికి అసలు కారణమిదేనా?
X

బండ్ల గణేష్.. నటుడిగా, నిర్మాతగా బహుశా తెలియని వారుండరేమో. కమెడియన్ గా యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత బిజినెస్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టారు. ఫౌల్ట్రీ వ్యాపారంలో విజయవంతం అయ్యాక మళ్లీ నిర్మాతగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు తన కామెంట్స్, పోస్టులతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.

ఇప్పటికే బాలీవుడ్ లో ఉన్న దీపావళి పార్టీ కల్చర్ ను ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ట్ చేశారు. దివాళీ అంటే టాలీవుడ్ సెలబ్రిటీల మొత్తంలో అందరికీ గుర్తొచ్చేది బండ్ల గణేషే. ఏటా ఆయన దివాళీ పేరుతో తాను పేల్చబోయే పటాకులతో ప్రదర్శన నిర్వహిస్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ ఎప్పుడూ వైరల్ అవుతాయి.

అయితే ఈసారి బాలీవుడ్ లో ఉన్న ట్రెండ్ ను ఇప్పుడు టాలీవుడ్ లో మొదలుపెట్టి శనివారం రాత్రి భారీ పార్టీని ఏర్పాటు చేశారు. బండ్ల దివాళీ 2025 పేరుతో ఆయన స్వగృహంలో నిర్వహించిన గ్రాండ్ పార్టీకి టాలీవుడ్‌ సీనియర్ స్టార్లు, యంగ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు సహా అనేక మంది అటెండ్ అయ్యారు. ఓ రేంజ్ లో సందడి చేశారు.

బండ్ల దివాళీ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాగా, వెంకటేష్, శ్రీకాంత్, సిద్దు, తేజ సజ్జా సహా అనేక మంది అటెండ్ అయ్యారు. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు ఫుల్ వైరల్ గా మారాయి. అదిరిపోయాయని చెబుతున్న నెటిజన్లు.. బండ్ల గణేష్ సడెన్ గా పార్టీ చేయడానికి అసలు కారణమేంటోనని డిస్కస్ చేసుకుంటున్నారు.

దీంతో అభిమానులు, సినీ ప్రియులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బండ్ల గణేష్.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రాండ్ రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకే పార్టీ నిర్వహించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో బండ్ల గణేష్.. తన కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేయిస్తానని రీసెంట్ గా తెలిపారు. ఒకరు హీరోగా.. మరొకరు డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. బహుశా వారిని ఇండస్ట్రీకి మరింత దగ్గర చేయడానికి సరైన టైమ్ చూసుకుని దివాళీ స్పెషల్ గా పార్టీ నిర్వహించి ఉంటారని కూడా కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా పార్టీకి కారణం పక్కన పెడితే.. బండ్ల ట్రెండ్ మాత్రం సెట్ చేశారు.