మీమ్స్‌లో కామెడీ.. బండ్లన్న నెట్‌వర్క్ మాత్రం పెద్దదే
బండ్ల గణేష్ మాట్లాడిన పాత వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటాయి. అందులో తన పరిచయాల గురించి ఆయన చెప్పే మాటలు మరింత వైరల్.
By: M Prashanth | 17 Aug 2026 3:25 PM ISTబండ్ల గణేష్ మాట్లాడిన పాత వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటాయి. అందులో తన పరిచయాల గురించి ఆయన చెప్పే మాటలు మరింత వైరల్. ట్రంప్‌తో కూడా ఫొటో దిగగలననే స్థాయిలో ఒక సందర్భంలో చెప్పిన మాటను నెటిజన్లు ఇప్పటికీ మీమ్స్‌లో వాడుతుంటారు. ఆయన కాన్ఫిడెన్స్‌ను చాలామంది కామెడీగా తీసుకుంటారు.
కానీ ఇప్పుడు కూతురు పెళ్లికి వచ్చిన అతిథులను చూస్తే.. ఆ మాటల వెనుక కనీసం ఒక విషయం మాత్రం కనిపిస్తోంది. బండ్లకు పరిచయాల పరిధి చిన్నది కాదు. ఆగస్టు 16న హైదరాబాద్‌లో జరిగిన జనని సూర్యతేజ వివాహానికి సినిమా, రాజకీయ రంగాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు వచ్చారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సహా మీడియం రేంజ్ స్టార్లు, చిన్న హీరోలు కూడా హాజరయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వేడుకకు వచ్చారు. రాజకీయ నాయకులు, ఇండస్ట్రీ ప్రముఖులతో కలిసి ఆ గెస్ట్ లిస్ట్ సోషల్ మీడియాలో కూడా బాగా తిరిగింది. ఇది కేవలం పెళ్లి రోజు ఏర్పడిన పరిచయం కాదు. కొన్ని నెలలుగా బండ్ల స్వయంగా ప్రముఖుల ఇళ్లకు వెళ్లి ఆహ్వానాలు అందిస్తున్న ఫొటోలు వస్తూనే ఉన్నాయి. స్టార్స్ ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్లి ఆహ్వానించారు. అంతకుముందు జరిగిన నిశ్చితార్థానికే రాజకీయ, సినిమా రంగాలకు చెందిన పలువురు హాజరయ్యారు.
అయితే బండ్ల గణేష్ నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్న కాలం ముగిసి చాలా రోజులైంది. రాజకీయాల్లోనూ రోజూ యాక్టివ్‌గా కనిపించడం లేదు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ లేదా తన కామెంట్లతో వార్తల్లో ఉంటున్నారు. అయినా ఒకప్పుడు సినిమా నిర్మాణం, రాజకీయ ప్రయాణం, వ్యాపారం ద్వారా ఏర్పడిన పరిచయాలు మాత్రం పూర్తిగా కట్ కాలేదని ఈ వేడుక చూపించింది.
సోషల్ మీడియాలో కనిపించే బండ్ల గణేష్ ఒక భాగం మాత్రమే అన్నది మాత్రం ఈ పెళ్లితో హైలెట్ అయ్యింది. మీమ్స్‌లో ఆయన మాటలే ఎక్కువగా కనిపిస్తాయి. బయట మాత్రం చాలా సంవత్సరాల్లో ఏర్పడిన మరో సర్కిల్ ఉంది. ప్రస్తుతం సినిమాలు తీయకపోయినా.. ఒకప్పుడు ఏర్పడిన ఆ నెట్‌వర్క్ ఇంకా అలాగే ఉంది. అయితే మళ్ళీ సినిమాలు చేస్తానని కూడా బండ్ల గణేష్ చెప్పరు. కొడుకుని కూడా తీసుకు వస్తానని అన్నారు. మరి ఆ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.
