Begin typing your search above and press return to search.

ఎన్నికల విజయం వెనుక బండ్ల గణేష్

రెండున్నరేళ్ల క్రితమే రండి కూర్చుందాం, ఎవరి సమస్యలున్నా మాట్లాడుకుందాం అని పిలిచినా ఎవరూ ముందుకు రాలేదని గుర్తు చేశారు.

By:  M Prashanth   |   7 Sept 2026 9:28 AM IST
ఎన్నికల విజయం వెనుక బండ్ల గణేష్
X

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోరు ముగిసింది, రిజల్ట్స్ వచ్చేశాయి. ఊహించినట్టే సీనియర్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ ప్యానెల్ భారీ మెజారిటీతో క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటింది. ఫలితాలు వచ్చిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన సి. కళ్యాణ్, తనదైన స్టైల్లో ప్రత్యర్థులకు గట్టి కౌంటర్లు ఇస్తూనే తెరవెనుక అసలైన గేమ్ ఛేంజర్ గురించి ఓపెన్ అయిపోయారు. ఈ గెలుపు సంబరాల్లో ఆయన నోటి నుంచి వచ్చిన ఒక పేరు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ఫుల్ వైరల్ అవుతోంది.

నేను ఈ రోజు ప్రెసిడెంట్‌గా ఇంత హ్యాపీగా ఉండటానికి, ఈ స్థాయి విక్టరీ కొట్టడానికి కారణం నా తమ్ముడు బండ్ల గణేష్ అంటూ సి. కళ్యాణ్ బ్లాస్టింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎన్నికల వేళ బండ్ల గణేష్ బ్యాక్ ఎండ్‌లో నడిపించిన స్ట్రాటజీ, అందించిన సపోర్ట్ వల్లే తాను ఈ కుర్చీలో కూర్చున్నానని చెప్పకనే చెప్పేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.

గతంలో తన మాట వినని ప్రత్యర్థులపై సి. కళ్యాణ్ అదిరిపోయే సెటైర్లు వేశారు. రెండున్నరేళ్ల క్రితమే రండి కూర్చుందాం, ఎవరి సమస్యలున్నా మాట్లాడుకుందాం అని పిలిచినా ఎవరూ ముందుకు రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ గెలిచి కూర్చున్నాం, ఇప్పటికైనా ఈగోలు పక్కన పెట్టి రండి కలిసి పనిచేద్దాం అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పరిశ్రమ బాగుండాలంటే అందరూ కలిసి రావాలని, గెలిచిన వాళ్లం మేము పిలుస్తున్నాం కాబట్టి అవకాశాన్ని వాడుకోవాలని హితవు పలికారు.

ఇండస్ట్రీలో అత్యంత దయనీయంగా మారిన చిన్న నిర్మాతల ఇష్యూపై సి. కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సొంత డబ్బులు తెచ్చి కష్టపడి ప్రాజెక్ట్ తీస్తే, థియేటర్లలో రిలీజ్ చేసుకునేందుకు చిన్న ప్రొడ్యూసర్లు నానా పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని చేతులు పట్టుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏదో మాటలు చెప్పి వదిలేయకుండా, కేవలం 15 రోజుల్లోనే ఒక పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ప్రెస్ మీట్ పెట్టి అన్నీ బయటపెడతామని స్పష్టం చేశారు.

తన ప్యానెల్ సాధించిన ఓట్ల రికార్డుల గురించి ఆయన లెక్కలతో సహా వివరించారు. వైస్ ప్రెసిడెంట్స్ విభాగంలో మోహన్ వడ్లపట్ల 338 ఓట్లతో టాప్‌లో నిలిస్తే, దామోదర ప్రసాద్ 274 ఓట్లతో నెగ్గారన్నారు. కనీసం ప్రచారానికి కూడా రాలేకపోయిన జీవితా రాజశేఖర్‌కు 267 ఓట్లు పడ్డాయంటే తమ ప్యానెల్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ట్రెజరర్‌గా చెదలవాడ శ్రీనివాసరావు 383 ఓట్లు సాధించి ప్రత్యర్థులను దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చితక్కొట్టారని చెప్పారు.

జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు కానుమల్లికి 416 ఓట్లు, రామ సత్యనారాయణకు 398 ఓట్లు వచ్చాయని, అసలు సినిమా ఇక్కడే ఉందని చెబుతూ పద్మిని నాగులపల్లికి ఏకంగా 426 ఓట్లు పడ్డాయని గుర్తు చేశారు. ఛాంబర్ రికార్డుల్లో చాలామంది మెంబర్ల ఫోన్ నంబర్లు తప్పుగా ఉన్నాయని, వెంటనే వచ్చి డేటా కరెక్ట్ చేయించుకుంటే వాళ్లకు సేవ చేయడానికి తమకు ఈజీ అవుతుందని సి. కళ్యాణ్ పేర్కొన్నారు.