Begin typing your search above and press return to search.

SKN మాటలను నిజం చేయబోతున్న బండ్ల గణేష్.. త్వరలో సెకండ్ ఇన్నింగ్స్

ఈ క్రమంలోనీ తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ తాజాగా నటించిన 'తెలుసు కదా' మూవీ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. అక్కడికి నిర్మాత ఎస్కేఎన్ కూడా హాజరయ్యారు.

By:  Madhu Reddy   |   23 Oct 2025 3:24 PM IST
SKN మాటలను నిజం చేయబోతున్న బండ్ల గణేష్.. త్వరలో సెకండ్ ఇన్నింగ్స్
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న బండ్ల గణేష్ ముఖ్యంగా నిర్మాతగా కంటే పవన్ కళ్యాణ్ అభిమానిగానే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఈమధ్య సినిమాలు నిర్మించకపోయినా.. నిత్యం కాంట్రవర్సీ మాటలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. ముఖ్యంగా పలువురు వ్యక్తులను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అప్పుడప్పుడు ఎవరిని ఉద్దేశించి కామెంట్లు చేస్తారో కూడా తెలియని స్థితిలో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

అలాంటి బండ్ల గణేష్ ఈమధ్య సినీ సెలబ్రిటీలందరికీ దీపావళి సెలబ్రేషన్స్ పేరిట తన ఇంట పెద్ద ఎత్తున పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి హాజరైన సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్డు ఒక్కో ప్లేటు సుమారుగా 20,000 వరకు ఉంటుందని తెలిసి అది బండ్ల గణేష్ రేంజ్ అంటూ చాలామంది కామెంట్లు చేశారు కూడా.. అంతేకాదు ఈ ఈవెంట్లో చిరంజీవి కోసం ప్రత్యేకంగా సింహాసనం చేయించి మరోసారి వార్తల్లో నిలిచారు.

అలాంటి బండ్ల గణేష్ మరొకవైపు పలు సినిమా ఈవెంట్లకు చీఫ్ గెస్ట్ గా వెళ్తూ వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనీ తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ తాజాగా నటించిన 'తెలుసు కదా' మూవీ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. అక్కడికి నిర్మాత ఎస్కేఎన్ కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.." ఒక మేధావి సైలెంట్ గా ఉంటే దేశానికి ఎంత ప్రమాదమో.. బండ్ల గణేష్ సినిమాలు నిర్మించకుండా ఉంటే ఇండస్ట్రీకి అంత ప్రమాదం అంటూ తెలిపారు. అంతేకాదు బండ్ల గణేష్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలి అని.. ఆయన నుంచి మళ్లీ బ్లాక్ బాస్టర్ విజయాలు రావాలి" అని తెలుసు కదా ఈవెంట్లో తెలిపారు ఎస్కేఎన్..అయితే ఇప్పుడు ఆ మాటలను బండ్ల గణేష్ నిజం చేయబోతున్నట్లు ఆయనే స్పష్టంగా వెల్లడించారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఎస్కేఎన్ తో పాటు బండ్ల గణేష్ కూడా తెలుసుకదా మూవీ సక్సెస్ ఈవెంట్లో పాల్గొన్నారు. అదే వేదికగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.."నేను ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించాను. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో వచ్చిన తెలుసు కదా సినిమా లాంటివి నిర్మించాలంటే ధైర్యం కావాలి. ఆ విషయంలో విశ్వప్రసాద్ ను నేను అభినందిస్తున్నాను. నా విషయానికి వస్తే నేను 'టెంపర్' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాను. అంతేకానీ ఇండస్ట్రీకి ఫ్లాప్ లు ఇచ్చికాదు. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతాను" అంటూ బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. ఇది విన్న నెటిజన్స్ , బండ్ల గణేష్ అభిమానులు ఎట్టకేలకు నిర్మాత ఎస్కేఎన్ మాటలను బండ్ల గణేష్ నిజం చేయబోతున్నారు అంటూ కామెంట్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. మరి నెక్స్ట్ బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ నుంచి రాబోయే సినిమా ఏంటి? ఏ జానరు నుంచీ రాబోతోంది ? ఎవరు హీరో ఇలా పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.