Begin typing your search above and press return to search.

అవ‌మానాలు ఎదురైనా నిల‌బ‌డ్డ‌ హీరో: బండి సంజ‌య్

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ 50 ఏళ్లుగా క‌థానాయ‌కుడిగా ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేరు యూకే వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది

By:  Sivaji Kontham   |   30 Aug 2025 10:30 PM IST
అవ‌మానాలు ఎదురైనా నిల‌బ‌డ్డ‌ హీరో: బండి సంజ‌య్
X

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ 50 ఏళ్లుగా క‌థానాయ‌కుడిగా ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేరు యూకే వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం సాయంత్రం జ‌రిగిన స‌న్మాన స‌భ‌లో కేంద్ర మంత్రి బండి సంజ‌య్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు 65 ఏళ్ల మనిషి అయినా 25 ఏళ్ల‌ మనస్సు.. అని అన్నారు. ముక్కుసూటిగా ఉండే వ్యక్తి బాలయ్య బాబు. ఆయ‌న‌కు సినీ చరిత్రలో 50 ఏళ్ల కెరీర్ రికార్డు అనేది తెలుగు వారికి గర్వకారణం. నటుడిగా కుటుంబ వారసత్వాన్ని కొనసాగించటంతో పాటు అప్పటినుంచి ఇప్పటివరకు అదే ఎనర్జీ తో నటిస్తూ మెప్పిస్తున్నారు. అనేక ఒడిదుడుకులు అవమానాలు ఎదురైనా నిలబడ్డారు.

ఎన్టీఆర్ గారి చరిత్రను వక్రీకరించి అనేక సినిమాలు వస్తున్నా.. వారి తండ్రి పై ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, మహానాయకుడు సినిమాల‌ను చేశారు. సినీప‌రిశ్ర‌మ‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, అనేక అవ‌మానాలు ఎదుర్కొని స‌క్సెస్ వ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుని బాల‌య్య‌ అనుకున్న‌ది సాధించారు.

డాక్టర్ కాకున్నా బసవతారకం హాస్పిటల్ ద్వారా ప్ర‌జ‌ల‌కు భరోసా విశ్వాసం ధైర్యం అందిస్తున్నారు. బ‌స‌వ‌తార‌కం.. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి చాలా మందిని కాపాడుతోంది. ఒక‌సారి ఆస్ప‌త్రికి ఒక‌ స‌మ‌స్య వచ్చింది.. కేంద్రంలోని నాయ‌కుడు అమిత్ షా గారి దృష్టికి తీసుకెళితే... బాల‌కృష్ణ గారి కోసం చేసేయండి. బ‌స‌వ‌తార‌కం గురించి నాకు కూడా తెలుసు.. చాలా మందికి సేవ‌లు చేసిన ఆస్ప‌త్రి ఇది! అని వెంట‌నే ఆదేశాలు జారీ చేసారు. ఈరోజు ఒక క్యాన్స‌ర్ పేషెంట్ అడ్మిట్ అయితే ఒక భ‌రోసా, ధైర్యం ఉంది. ఆస్ప‌త్రిలో చాలా మందిని ర‌క్షిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోను బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రిని ప్రారంభించ‌డం సంతోషం.

ఎన్బీకే పుర‌స్కారం అందుకోవ‌డం తెలుగు ప్ర‌జ‌ల‌కు గ‌ర్వ‌కార‌ణం. తెలుగు వారికి ఆవేశం ఆనందం ఆలోచన వచ్చినా జై బాలయ్య అంటే ఓ ఉత్సాహం.. బాలకృష్ణ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్దిల్లి మరిన్ని అవార్డులు, రికార్డులు అందుకోవాలి.. అని అన్నారు.