Begin typing your search above and press return to search.

మసూదలో భయపెట్టిన అమ్మడు.. ఇప్పుడెంత అందంగా ఉందో..

టాలీవుడ్ లో కొన్నాళ్ల క్రితం వచ్చిన మసూద సినిమా గుర్తుందా? హారర్ జోనర్ లో రూపొందిన ఆ మూవీ.. అందరినీ మెప్పించింది.

By:  M Prashanth   |   4 Jan 2026 11:36 AM IST
మసూదలో భయపెట్టిన అమ్మడు.. ఇప్పుడెంత అందంగా ఉందో..
X

టాలీవుడ్ లో కొన్నాళ్ల క్రితం వచ్చిన మసూద సినిమా గుర్తుందా? హారర్ జోనర్ లో రూపొందిన ఆ మూవీ.. అందరినీ మెప్పించింది. ముఖ్యంగా ఆడియన్స్ ను భయపెట్టిందని చెప్పాలి. అందులో ఆత్మ ఆవహించిన అమ్మాయి పాత్రలో నటించిన బాంధవి శ్రీధర్.. తన యాక్టింగ్ తో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.




నిజానికి ఆ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించినా.. బాంధవి అందరి దృష్టిని ఆకర్షించారు. నాజియా పాత్రలో కనిపించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే మసూద తర్వాత పలు సినిమాల్లో నటించారు బాంధవి. కానీ ప్రస్తుతం హీరోయిన్ రోల్స్ లో కోసం ఫుల్ గా ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.




అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న అమ్మడు.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆమె ప్లాట్ ఫామ్స్ లో కొత్త కొత్త ఫోటోలు కనిపిస్తుంటాయి. అంతే కాదు అవి క్షణాల్లో వైరల్ అయ్యి అందరినీ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఫిట్‌నెస్, జిమ్ అంటే బాంధవికి చాలా ఇష్టం.

దీంతో జిమ్‌ లో తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది బాంధవి. తాజాగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్ లో అమ్మడు అదిరిపోయిందని చెప్పాలి. స్విమ్మింగ్ పూల్ ముందు వాల్ చైర్ లో కూర్చుని పోజులిచ్చిన బాంధవి.. తన చూపులతోనే మాయ చేస్తున్నట్లు ఉంది.

మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన బాంధవి.. మసూద తర్వాత 2024లో విడుదలైన లైట్ హౌస్, 2025లో విడుదలైన జాట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా జాట్ లో పోలీస్ అధికారిణిగా, పవర్ ఫుల్ యాక్షన్ తో కూడిన రోల్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.

హైదరాబాద్ కు చెందిన ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. మిస్టర్ పర్ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. మసూద మూవీతో లైమ్ లైట్ లో వచ్చిన అమ్మడు.. హీరోయిన్ గా ఛాన్సుల కోసం ఇప్పుడు ఎదురుచూస్తుంది. మరి చూడాలి ఎప్పుడు అమ్మడికి అవకాశమొస్తుందో..