Begin typing your search above and press return to search.

ముంబైపై బాల‌య్య కొత్త రాత రాయాలి!

ముంబై నేప‌థ్యంలో ఎన్నో తెలుగు సినిమా క‌థ‌లున్నాయి. ర‌క‌ర‌కాల క‌థ‌లు అక్క‌డ నేప‌థ్యంలో సాగాయి.

By:  Srikanth Kontham   |   8 Feb 2026 9:53 AM IST
ముంబైపై బాల‌య్య కొత్త రాత రాయాలి!
X

ముంబై నేప‌థ్యంలో ఎన్నో తెలుగు సినిమా క‌థ‌లున్నాయి. ర‌క‌ర‌కాల క‌థ‌లు అక్క‌డ నేప‌థ్యంలో సాగాయి. ఎక్కువ‌గా ముంబై అంటే మాఫియా-అండ‌ర్ వ‌ర‌ల్డ్ క‌థ‌లే హైలైట్ అవుతుంటాయి. ప్ర‌స్తుతం ఫాంలో ఉన్న హీరోలంతా ముంబై నేప‌థ్యంలో చాలా సినిమాలు చేసారు. వాటిలో కొన్ని స‌క్సెస్ అయ్యాయి. మరికొన్ని ఫెయిల‌య్యాయి. న‌ట‌సింహ బాల‌కృష్ణ కూడా ముంబై నేప‌థ్యంలో గ‌తంలో మూడు సినిమాలు చేసారు. 2002 లో రిలీజ్ అయిన `చెన్న కేశ‌వ‌రెడ్డి` కి ముంబై నేప‌థ్య‌ముంటుంది. ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేసారు. ఇందులో కుమారుడి పాత్ర‌ (భ‌ర‌త్ రెడ్డి) ముంబైలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ డీసీపీగా ప‌నిచేస్తాడు.

సినిమా ప్రారంభ స‌న్నివేశాల‌న్ని ముంబై బ్యాక్ డ్రాప్ లోనే సాగుతాయి. `చెన్న కేశ‌వ రెడ్డి` అన్న‌ది ఆ పాత్ర‌కు తండ్రి రోల్. అయితే ఈ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా యావ‌రేజ్ గా ఆడింది. దీంతో బాల‌య్య చాలా కాలం పాటు ముంబై నేప‌థ్యంలోకి వెళ్ల‌లేదు. మ‌ళ్లీ ద‌శాబ్దం త‌ర్వాత `ల‌య‌న్` తో ముంబై బ్యాక్ డ్రాప్ ని టచ్ చేసారు. ఈ సినిమా క‌థా గ‌మ‌నం ముంబైతోనే ముడి ప‌డి ఉంటుంది. సినిమా ప్రారంభంలోని హీరో హిస్పిట‌ల్ స‌న్ని వేశాలు అక్క‌డ నేప‌థ్యంతోనే సాగుతాయి. ఇందులో బాల‌య్య బోస్ , గాడ్సే అనే రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తారు.

అటుపై పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `పైసా వ‌సూల్` ముంబై మాఫియా-అండ‌ర్ వ‌ర‌ల్డ్ అంశాలు అంధారంగా తెర‌కెక్కించిన చిత్రంలో న‌టించారు. ఇందులో బాల‌కృష్ణ తేడా సింగ్- రా ఏజెంట్ బాల పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. తేడా సింగ్ పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. అయితే సినిమా అంచ‌నాల‌ను అందుకోలేదు. ఇలా ముంబై నేప‌థ్యంలో సాగిన మూడు సినిమాలు బాల‌య్య‌కు పెద్ద‌గా క‌లిసి రాలేద‌న చెప్పాలి.

తాజాగా మ‌రోసారి ముంబై నేప‌థ్యంలోనే బాల‌య్య 111వ చిత్రం తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తోంది. గోపీచంద్ మ‌లినేనితో బాల‌య్య మ‌రోసారి జ‌త క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో ముంబై నేప‌థ్యంలో సాగే మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెలుస్తోంది. ఇందులో బాల‌య్య సింగిల్ రోల్ లోనే క‌నిపిస్తారుట‌. గ‌త కొంత కాలంగా బాల‌య్య ఎక్కువ‌గా డ్యూయెల్ రోల్స్ పోషించ‌డం చూడొచ్చు.

అలాగే ముంబై నేప‌థ్యంలో తెర‌కెక్కిన అన్ని సినిమాల్లోనూ ద్విపాత్రాభిన‌యమే. కానీ ఈసారి ఆ రెండింటికి భిన్నంగా సింగిల్ రోల్ లో క‌నిపించ‌డం ఇంట్రెస్టింగ్. అలాగే ఈసారి బాల‌య్య ముంబై పాత సెంటిమెంట్ ని చేరిపేసి స‌క్స‌స్ అనే సెంటిమెట్ కు పునాది వేయాలి. బాల‌య్య దెబ్బ‌కు వాణిజ్య రాజ‌ధాని కూడా ఒణ‌కాలి. మార్చి మొద‌టి వారంలోనే ఈ సినిమా ప్రారంభం కానుంద‌ని స‌మాచారం.