బాలయ్య బాబు ఎవరికి భయపడతారో చెప్పిన అల్లుడు లోకేష్
సీనియర్ నటుడు, హోస్ట్ జగపతి బాబు బుల్లితెరపై తనదైన శైలిలో రాణిస్తూ దూసుకెళ్తున్నారు.
By: Sivaji Kontham | 25 Oct 2026 3:58 PM ISTసీనియర్ నటుడు, హోస్ట్ జగపతి బాబు బుల్లితెరపై తనదైన శైలిలో రాణిస్తూ దూసుకెళ్తున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `జయమ్ము నిశ్చయమురా సీజన్ 2` కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. టాప్ సెలబ్రిటీ ఇంటర్వ్యూలను రక్తి కట్టించడంలో జగపతి బాబు హోస్టింగ్ నైపుణ్యానికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ షోకి తెదేపా యువనేత, మంత్రి నారా లోకేష్ అతిథిగా విచ్చేయడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
`జయమ్ము నిశ్చయమురా-2` కార్యక్రమంలో భాగంగా హోస్ట్ జగపతి బాబు - నారా లోకేష్ మధ్య జరిగిన సంభాషణలతో ఒక టీజర్ విడుదల కాగా, ఇందులో వారి మాటలు ఆసక్తికరంగా సాగాయి. ``సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటూ ప్రజాసేవ చేస్తున్న యువగళం నారా లోకేష్‌ను జగపతి బాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ ఎపిసోడ్లో అభిమానుల కోలాహలం మధ్య `జై బాలయ్య! జై బాలయ్య!` అనే నినాదాలు మార్మోగాయి.
ఈ సంభాషణల మధ్యలో నందమూరి బాలకృష్ణ ప్రస్తావన.. వారి మధ్య జరిగిన సరదా సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ``బాలయ్య బాబు గారు ఒక్కరికి భయపడతారు...`` అని లోకేష్ అనగానే..`` బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరూ నోట్ దిస్ పాయింట్...`` అని జగపతి బాబు అన్నారు. చిన్నప్పుడు ఎక్కువ తిట్లు తినేవాడివా? అని ప్రశ్నించగా.. లోకేష్ మాటలను కొనసాగిస్తూ.. ``చిన్నప్పుడు తిట్లు తినేవాడిని నేను... స్కూల్లో ఎక్కువ చితకబాదేది నన్నే...`` అంటూ సరదాగా పంచుకున్నారు. ఆ తర్వాత ``పోటీ పడాలి కదా మామయ్య...`` అని లోకేష్ అనగానే.., ``నిజం అల్లుడు గారు అన్నారు... నువ్వు ఫిట్టింగ్ పెడుతున్నారు అనుకున్నా...`` అంటూ వారి మధ్య నవ్వులు పూశాయి. అంతేకాకుండా, ఫ్లూటూ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..! అనే పవర్ పుల్ బాలయ్య డైలాగ్‌ను నారా లోకేష్ వినిపించి అందరినీ అలరించారు.
ఈ ఎపిసోడ్ చివరలో `జయమ్ము నిశ్చయమురా` కార్యక్రమం పాట వినిపించడంతో షో ముగిసింది. మరోవైపు, రాజకీయాల పరంగా చూస్తే తెదేపా యువనేత నారా లోకేష్ ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ చేయడానికి, ఐటీ పరిశ్రమను గమ్యస్థానంగా మార్చడానికి ఆయన తనవంతు కృషి చేస్తున్నారు. అలాగే ఈ కార్పొరేషన్, జెడ్పీటీసి, ఎంపిటిసి ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా శ్రేణులను నిర్దేశిస్తున్నారు.
సినిమా ముచ్చట్లు, రాజకీయ విశేషాలు కలబోసిన ఈ షో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. మంత్రి లోకేష్ నాయుడు వినోదంతో పాటు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఇన్నేళ్ల పాలనకు ప్రజల వైపు నుంచి ఫలితం ఎలా వస్తుందో వేచి చూడాలి. షో నుంచి కేవలం ఒక చిన్న గ్లింప్స్ మాత్రమే విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ విడుదలైతే బాలయ్య బాబు ఎవరికి భయపడతారో ప్రేక్షకులకు తెలుసుకోగలరు!
