Begin typing your search above and press return to search.

'మాన్షన్ హౌజ్'తో బాలయ్యకు దిష్టి.. అదే తీర్థంగా..

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో రూపొందిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   13 Dec 2025 10:32 AM IST
మాన్షన్ హౌజ్తో బాలయ్యకు దిష్టి.. అదే తీర్థంగా..
X

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో రూపొందిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామాగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఆ సినిమాను 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు.

డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన అఖండ 2.. అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు నిన్న వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల అవ్వగా.. ముందు రోజు నైట్ పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. అయితే ఎప్పటి నుంచో సినిమా కోసం వెయిట్ చేస్తున్న బాలయ్య అభిమానులు.. థియేటర్స్ వద్ద ఓ రేంజ్ లో సందడి చేశారు.

సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూడా థియేటర్స్ వద్ద పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. బ్యానర్లతో థియేటర్స్ ను నింపేశారు. కొన్ని చోట్ల డెకరేట్ కూడా చేశారు. సినిమా షో పడే ముందు.. డబ్బులు కొడుతూ చిందులు వేశారు. తాము ఎంతగానో ఎదురుచూస్తున్న తమ అభిమాన హీరో సినిమాను ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లిలో మాన్షన్ హౌజ్ మందు బాటిల్ తో కొందరు ఫ్యాన్స్ ఏకంగా దిష్టి తీశారు. సినిమా చూసిన వారు.. థియేటర్ వెలుపల బాలయ్య, బోయపాటి శ్రీను, తమన్ కు దిష్టి తీశారు. వారిపై ఎవరి దిష్టి పడకూడదని అలా చేసినట్లు తెలిపారు. అంతే కాదు.. దాన్నే తీర్థంగా తీసుకుంటామని చెప్పారు.

అక్కడ ఉన్న కొందరు ఫ్యాన్స్ కు చేతిలో కూడా వేశారు. అందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతున్నారు. నిమ్మకాయలు, గుమ్మడి కాయతోనే దిష్టి తీయాలి కానీ.. మందుతో తీయడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇదెక్కడి పిచ్చిరా బాబూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా కొందరు ఫ్యాన్స్ అలానే చేశారు. సినిమా రిలీజ్ చివరి నిమిషంలో వాయిదా పడడంతో నిరాశ చెందిన అభిమానులు.. మాన్షన్ హౌస్‌ మందుతో బాలయ్య పోస్టర్ కు ఏకంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత దిష్టి కూడా తీశారు. అప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పుడు దిష్టి తీస్తున్న వీడియో వైరల్ అవుతోంది.