బౌండరీలు దాటిన బాలన్
మలయాళ సినిమాలకు రెగ్యులర్ గా ఉండే ఆదరణను దాటి, ఇప్పుడు దేశవ్యాప్తంగా థియేటర్లలో డీసెంట్ బజ్ క్రియేట్ చేస్తున్న చిత్రం 'బాలన్: ది బాయ్'.
By: M Prashanth | 23 Jun 2026 11:54 AM ISTమలయాళ సినిమాలకు రెగ్యులర్ గా ఉండే ఆదరణను దాటి, ఇప్పుడు దేశవ్యాప్తంగా థియేటర్లలో డీసెంట్ బజ్ క్రియేట్ చేస్తున్న చిత్రం 'బాలన్: ది బాయ్'. ఫ్రాన్స్ లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇంటర్నేషనల్ వైడ్ గా సినీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు లోకల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాకుండా, ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ కథను ఏ విధంగా చెప్పొచ్చో ఈ చిత్రం ద్వారా దర్శకుడు చిదంబరం స్క్రీన్ మీద చూపించాడు.
తల్లీకొడుకుల బంధం చుట్టూ సాగే ఈ కథలో ఈజీగా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి దీనికి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ చేయడంతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా సినిమా ఈజీగా కనెక్ట్ అవుతోంది. మొదటి రోజు నుంచే డీసెంట్ మౌత్ టాక్ రావడం సినిమా లాంగ్ రన్ కు హెల్ప్ అయ్యేలా కనిపిస్తోంది.
రిలీజ్ కి ముందు నుంచే ఈ ప్రాజెక్ట్ మీద ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ ఒపీనియన్ నెలకొంది. నాగ చైతన్య, ప్రియదర్శన్ లాంటి వాళ్లు దీనిపై మాట్లాడటం కాస్త క్యూరియాసిటీని పెంచింది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రీమియర్ కు నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, నిహారిక కొణిదెలతో పాటు పలువురు సినీ ప్రముఖులు అటెండ్ అయ్యారు. సినిమా చూశాక వాళ్లంతా స్క్రీన్ ప్లే, ఎమోషనల్ సీన్స్ చాలా నాచురల్ గా వర్కవుట్ అయ్యాయని ఫీల్ అవుతూ చిత్ర యూనిట్ కు తమ అభినందనలు తెలియజేశారు.
సౌత్ లోని ఇతర మార్కెట్లతో పాటు నార్త్ లోనూ బాలన్ కు డీసెంట్ అటెన్షన్ దక్కుతుండటం విశేషం. చెన్నైలో జరిగిన స్క్రీనింగ్ కు శరత్ కుమార్, రాధిక, సిద్ధార్థ్, శ్రీలీల లాంటి వాళ్లు వచ్చి కథ సాగిన విధానం బాగుందని చెప్పారు. ముంబైలో వేసిన ప్రీమియర్ షోకి కూడా అక్కడి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. కథలో ఉండే యూనివర్సల్ అప్పీల్, హ్యూమన్ ఎమోషన్స్ వల్లే ఇలా వేర్వేరు భాషల జనాలకు ఈ సినిమా కనెక్ట్ అవుతోందని అంటున్నారు.
ఈ సినిమా తెరవెనుక ఉన్న టెక్నికల్ టీమ్ వర్క్ కూడా కథకు బాగా ప్లస్ అయింది. రచయిత జీతు మాధవన్ రాసుకున్న సహజమైన పాత్రలకు, సుశిన్ శ్యామ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ ఇంపాక్ట్ బాగుంది. షైజు ఖాలిద్ సినిమాటోగ్రఫీ ఈ కథకు కావాల్సిన మూడ్ ను క్రియేట్ చేసింది. టెక్నికల్ గా అన్ని విభాగాలు బ్యాలెన్స్ అవ్వడం వల్లే స్క్రీన్ మీద ఆ ఫీల్ ప్రేక్షకులకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేరింది.
నటీనటుల విషయానికి వస్తే ఫర్జానా, మాస్టర్ ఆదిశేషన్, మాస్టర్ జినన్ తమ తమ పాత్రల్లో సహజంగా నటించి మెప్పించారు. గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించిన స్టార్ హీరో టొవినో థామస్ తన లుక్ తో ఆకట్టుకున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్, థెస్పియన్ ఫిల్మ్స్ బ్యానర్లపై వెంకట్ కె నారాయణ, శైలజ దేశాయ్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు అన్ని భాషల్లోనూ స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.
