Begin typing your search above and press return to search.

బాలయ్యతో మూవీ.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ ఆత్రేయ?

అదే సమయంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ తో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది.

By:  M Prashanth   |   11 May 2026 10:00 PM IST
బాలయ్యతో మూవీ.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ ఆత్రేయ?
X

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ కు సిద్ధమవుతున్న బాలయ్య.. అదే సమయంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ తో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది.

ఇప్పటికే వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సరిపోదా శనివారం మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో ఆయన చేయబోయే సినిమా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఆ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం.

అయితే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయట. కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో పాటు బాలయ్య ఇమేజ్‌ కు తగ్గ మాస్ టచ్ ఉండేలా కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆ సినిమాలో బాలయ్య పోషించనున్నట్లు రోల్స్ విషయంలో వచ్చిన రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారాయి.

ఒకవైపు బాలయ్య డ్యూయల్ రోల్‌ లో కనిపించే అవకాశముందని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఇది మల్టీస్టారర్‌ గా తెరకెక్కవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే తన కెరీర్‌ లో బాలయ్య ఎన్నో డ్యూయల్ రోల్ పాత్రల్లో నటించి అభిమానులను అలరించారు. ముఖ్యంగా తండ్రీకొడుకు లేదా రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో ఆయన నటనకు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో మరోసారి డ్యూయల్ రోల్‌లో బాలయ్య కనిపిస్తే అభిమానులకు అది స్పెషల్ ట్రీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అదే సమయంలో మరో హీరో కూడా సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ హీరో ఎవరు? కథలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. బాలయ్య గతంలో కొన్ని మల్టీస్టారర్ చిత్రాలు చేసినప్పటికీ.. ఇటీవలి కాలంలో ఎక్కువగా సోలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. అందుకే నిజంగానే ఆ సినిమా మల్టీస్టారర్‌గా వస్తుందా లేదా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇక ఆ చిత్రానికి కురుక్షేత్రం అనే పవర్‌ ఫుల్ టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్‌ కు తగ్గట్టుగానే కథలో భారీ స్థాయి యాక్షన్, ఎమోషనల్ డ్రామా, హై వోల్టేజ్ సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ కు తగ్గట్టుగా వివేక్ ఆత్రేయ తన స్టైల్‌ లో కొత్త ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ప్రాజెక్ట్‌ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య మార్కెట్‌, అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ బడ్జెట్‌ ను కేటాయించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగా.. ఈ ఏడాది దసరా తర్వాత సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మొత్తానికి బాలయ్య- వివేక్ ఆత్రేయ కాంబినేషన్ ఇప్పటి నుంచే ఆసక్తిని పెంచుతోంది. డ్యూయల్ రోల్, మల్టీస్టారర్ అంశాల్లో ఏది నిజమవుతుందో చూడాల్సి ఉంది. అయితే ఒక విషయం మాత్రం క్లియర్.. కొత్త కాంబోలో అభిమానులు కొత్త తరహా బాలయ్యను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.