బాలకృష్ణ – వివేక్ ఆత్రేయ కాంబోలో గ్యాంగ్‌స్టర్ సినిమా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 23 March 2026 1:00 AM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఒక కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది.
రజినీకాంత్ కోసం రాసిన కథలు బాలయ్య…!
మొదట ఈ కథను సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెప్పారని సమాచారం. అయితే ఆయన కూలీ సినిమా తర్వాత మరో గ్యాంగ్‌స్టర్ కథ చేయాలనే ఆసక్తి లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారం. దీంతో ఈ కథ బాలకృష్ణ దగ్గరకు వచ్చింది. చివరకు బాలయ్య ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేయడంతో సినిమా త్వరలోనే షూటింగ్‌కు వెళ్లనుంది అని తెలుస్తోంది.
వివేక్ ఆత్రేయ సినిమాలు ఎప్పుడూ కొత్తగా ఉంటాయి. ఆయన మెంటల్ మధిలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తర్వాత బ్రోచేవారెవరురా అనే క్రైమ్ కామెడీతో మంచి హిట్ అందుకున్నారు. 2022లో వచ్చిన అంటే సుందరానికి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన సరిపోదా శనివారం సినిమా ఆయనకు మరో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చేసే దర్శకుడు, మాస్ హీరో బాలకృష్ణతో పని చేయడం చాలా ఆసక్తికరంగా మారింది. బాలయ్యను స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఎలా చూపిస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు మంచి కథ కూడా ఉంటుందని టాక్.
ఇదిలా ఉంటే, బాలకృష్ణ మరో సినిమా NBK 111తో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పని చేయడం తనకు అదృష్టమని ఆయన చెప్పారు.
NBK 111 సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇలా రెండు భారీ సినిమాలతో బాలకృష్ణ మరోసారి తన స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
