Begin typing your search above and press return to search.

బాలయ్య ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకేసారి!

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరుకి సపరేట్ బ్రాండ్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

By:  Madhu Reddy   |   17 Aug 2025 12:26 PM IST
బాలయ్య ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకేసారి!
X

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరుకి సపరేట్ బ్రాండ్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి నందమూరి తారక రామారావు లక్షణాలన్ని పుణికి పుచ్చుకొని...అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో రాణిస్తున్న బాలకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎందుకంటే ఈయన సినిమాలు, రాజకీయాలే కాదు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ వహ్వా అనిపించుకుంటున్నారు. అయితే అలాంటి నందమూరి బాలకృష్ణ సినిమాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. వరుస సినిమాలతో జోరు మీదున్న బాలకృష్ణ నెక్స్ట్ రెండు సినిమాలను ఒకేసారి స్టార్ట్ చేయబోతున్నారట.మరి ఇంతకీ బాలకృష్ణ చేయబోయే ఆ రెండు సినిమాలు ఏంటి? షూటింగ్ ఎప్పటినుండి స్టార్ట్ అవ్వబోతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నందమూరి బాలకృష్ణ ఏడాదికో సినిమా చేస్తూ సినిమాల్లో తన మేనియా కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ గత ఏడాది డాకు మహారాజ్ సినిమాతో వచ్చి హిట్ కొట్టారు. అలా వరుసగా ఆయన చేసిన సినిమాలు హిట్స్ అవుతున్నాయి. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ ఇలా వరుస సినిమాలు హిట్ అయ్యాయి. ఇక సక్సెస్ బాటలో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీకి సీక్వెల్ గా వస్తున్న 'అఖండ2: తాండవం' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే అఖండ 2: తాండవం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.

సెప్టెంబర్ 25న అఖండ2: తాండవం విడుదల కాబోతున్నట్టు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం అఖండ2 మూవీ విఎఫ్ఎక్స్ లో కాస్త జాప్యం నెలకొనడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ పూర్తయితే ఈ సినిమాని సెప్టెంబర్ లోనే విడుదల చేయాలని.. లేకపోతే డిసెంబర్ కి వాయిదా వేయాలని చూస్తున్నారట. అటు అఖండ 2 సినిమా కాస్త పక్కన పెడితే..బాలకృష్ణ హీరోగా చేయబోయే రెండు సినిమాలు నవంబర్లో ఒకేసారి సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణతో వర్క్ చేయడానికి ఇప్పటికే గోపీచంద్ మలినేని, క్రిష్ జాగర్లమూడి ఇద్దరు వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి బాలకృష్ణ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఆదిత్య 369 కి సీక్వెల్ రాబోతుందనే రూమర్లు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వీరసింహారెడ్డి మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మళ్ళీ వీరి కాంబోలో రెండో సినిమా కూడా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గోపీచంద్ మలినేని, క్రిష్ జాగర్లమూడి ఇద్దరితో చేసే సినిమాలు కూడా నవంబర్ లోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ చేసే సినిమా మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టు సమాచారం.అయితే రెండు సినిమాలు ఏకకాలంలో సెట్ మీదకి వెళ్ళబోతున్నాయి కాబట్టి రెండు సినిమాలను ఒకేసారి మెయింటైన్ చేయడం వర్కౌట్ అవుతుందా అని మరికొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ ఒక సినిమా పూర్తి కాక ముందే రెండు మూడు సినిమాలు లైన్ లో పెడుతూ ఇండస్ట్రీలో బిజీబిజీగా గడుపుతున్నారు.