Begin typing your search above and press return to search.

సర్జరీ తర్వాత తొలిసారి కనిపించిన బాలయ్య.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

అయితే ఇటీవల ఈ సినిమాలోని ఒక యాక్షన్ ఎపిసోడ్ ను కాకినాడ పోర్టులో షూటింగ్ జరుపుతున్న సమయంలో యాక్షన్ స్టంట్స్ చేస్తూ ఒక్కసారిగా బాలయ్య కింద పడ్డారు.

By:  Madhu Reddy   |   4 Sept 2026 10:58 AM IST
సర్జరీ తర్వాత తొలిసారి కనిపించిన బాలయ్య.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
X

నటసింహ నందమూరి బాలకృష్ణ ఆరుపదుల వయసు దాటినా.. యాక్షన్ పర్ఫామెన్స్ కనబరుస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా క్లిష్టమైన స్టంట్స్ చేయడానికి కూడా ఎలాంటి డూప్ వాడకుండా.. స్వయంగా చేస్తూ.. ఎంత కష్టం వచ్చినా సరే అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా వరుస సినిమాలతో బిజీగా మారిన బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాలోని ఒక యాక్షన్ ఎపిసోడ్ ను కాకినాడ పోర్టులో షూటింగ్ జరుపుతున్న సమయంలో యాక్షన్ స్టంట్స్ చేస్తూ ఒక్కసారిగా బాలయ్య కింద పడ్డారు.

సర్జరీ తర్వాత తొలిసారి కనిపించిన బాలయ్య..

తర్వాత అత్యవసర చికిత్స అందించి, హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. సర్జరీ తర్వాత ఇంటికే పరిమితమైన బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటూ అభిమానులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా.. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే ఒక అభిమాని తన కాబోయే భార్యతో కలిసి బాలయ్య, ఆయన సతీమణి వసుంధర దేవి లకు ఆహ్వాన పత్రిక అందించి, పెళ్లికి రావాలని కోరారు. అనంతరం వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు ఈ కాబోయే జంట.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాలకృష్ణను సర్జరీ తర్వాత చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో వైరల్.. ఆనందోత్సాహంలో అభిమానులు..

ముఖ్యంగా ఆ వీడియోలో బాలకృష్ణ ఎలాంటి సపోర్టు లేకుండా నిలబడడం చూస్తుంటే ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకున్న బాలయ్యను తొలిసారి ఇలా చూసేసరికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే బాలయ్య అక్టోబర్ నెల నుంచి తన కొత్త చిత్రం ఎన్ బి కే 111 షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

ద్విపాత్రాభినయం చేస్తున్న బాలయ్య..

ఎన్.బి.కె 111 సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండు కాలాలలో.. ఒక పాత్రలో రాజవంశీయుడైన రాజుగా.. మరో పాత్రలో కఠినమైన సముద్రవాసిగా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ .తమన్ సంగీతం అందిస్తున్నారు.

బాలకృష్ణ తదుపరి చిత్రాలు..

మరోవైపు బాలయ్య ఎన్.బి.కే 112 చిత్రంతోపాటు వివేక్ ఆత్రేయ, కొరటాల శివ దర్శకత్వంలలో ఒక్కో సినిమా చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయబోయే సినిమా గ్యాంగ్ స్టార్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.