Begin typing your search above and press return to search.

బాలయ్య వెనక్కి తగ్గుతున్నాడా..?

ఓ పక్క ఆరోజే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అవుతుంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఇప్పటికే మరోసారి రిలీజ్ కన్ఫర్మ్ చేశారు.

By:  M Prashanth   |   12 Aug 2025 8:00 PM IST
బాలయ్య వెనక్కి తగ్గుతున్నాడా..?
X

నందమూరి నట సింహం బాలకృష్ణ వెనక్కి తగ్గుతున్నాడా.. అదేంటి ఏ విషయంలో అంటే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా విషయంలో అని టాక్. ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఆ డేట్ కి సినిమా రిలీజ్ చేయడం కష్టమని టాక్. ఓ పక్క ఆరోజే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అవుతుంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఇప్పటికే మరోసారి రిలీజ్ కన్ఫర్మ్ చేశారు.

సెప్టెంబర్ 25 అఖండ 2..

ఓజీ అసలైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఐతే ఓజీ రిలీజ్ అనుకున్న సెప్టెంబర్ 25కే అఖండ 2 రిలీజ్ లాక్ చేశారు. కానీ సినిమా రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు మేకర్స్. బాలయ్య, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే రోజు వస్తే ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. రెండు సినిమాలు జోనర్లు వేరు. ఐతే ఇక్కడ మరో విశేషం ఏంటంటే రెండు సినిమాలను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.

ఓజీ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది. అందుకే సినిమాను ఈసారి నేషనల్ వైడ్ రిలీజ్ అనుకుంటున్నారు. మరోపక్క అఖండ సినిమా తెలుగులో రిలీజై గ్రాండ్ సక్సెస్ అవగా హిందీలో కూడా ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్ బాగా చూశారు. అందుకే అఖండ 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలు రెండు ఒకేసారి రిలీజైతే ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది.

బాక్సాఫీస్ దగ్గర సందడి..

సినిమాలు రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఉంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇంకా బాక్సాఫీస్ దగ్గర సందడి ఉంటుంది. ఐతే అఖండ 2 రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ సినిమాకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ బాగా ఉన్న కారణంగా అనుకున్న టైం కు సినిమా పూర్తి అవుతుందా లేదా అన్న డౌట్ ఉందట. మరి ఈ కన్ ఫ్యూజన్ ఎన్నాళ్లకు క్లియర్ అవుతుందో చూడాలి.

పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సెప్టెంబర్ 25 కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఓజీ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అఖండ 2 కి కూడా థమనే మ్యూజిక్ డైరెక్టర్. మరి ఈ రెండు సినిమాల ఫైట్ షురూ అయితే థమన్ తో థమన్ పోటీ పడతాడు. బాలకృష్ణ అఖండ 2 వాయిదా పడితే మాత్రం ఓజీ సింగిల్ రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. తప్పకుండా అది పవర్ స్టార్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఒకవేళ అఖండ 2 రేసులో వస్తే దసరాకి టఫ్ ఫైట్ జరుగుతుంది.