బాలయ్య నో చెప్పడంతోనా? లేక మరో పాత్రకా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో కొనసాగిన పాత్రలతో పాటు, గెస్ట్ అపిరియన్స్ లు కూడా యధావిధిగా కొనసాగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
By: Srikanth Kontham | 29 Nov 2025 3:00 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో కొనసాగిన పాత్రలతో పాటు, గెస్ట్ అపిరియన్స్ లు కూడా యధావిధిగా కొనసాగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటితో పాటు అదనంగా చాలా మంది స్టార్లు కూడా భాగమవుతున్నారనే ప్రచారం గట్టిగానే జరిగింది. వెరసీ ఇవన్నీ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చాయి. కానీ సగం షూటింగ్ పూర్తయ్యే సరికి సీన్ మొత్తం మారిపోయింది. శివరాజ్ కుమార్ తప్పా ఎవరూ కంటున్యూ అవ్వలేదు.
మోహన్ లాల్, జాకీ ష్రాప్ లాంటి నటులు ఎగ్జిట్ అయ్యారు. వాళ్ల స్థానల్లో కొత్త నటులు తెరపైకి వచ్చారు. ఎస్.జె.సూర్యను ఓ పాత్రకు ఎంపిక చేయగా, మిథున్ చక్రవర్తిని మరో పాత్రకు ఎంపిక చేసారు. టాలీవుడ్ నుంచి సింహం బాలకృష్ణ కూడా బరిలోకి దిగుతున్నారనే ప్రచారం గట్టిగానే జరిగింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా మారి పోయాయి. ఎక్కడలేని హైప్ మొదలైంది. కానీ బాలయ్య మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. తాను ఈ ప్రాజెక్ట్ లో భాగం కావాలని మేకర్స్ కోరుకున్నా? వీలు కాకపోవడంతో బాలయ్య చేయలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో తమిళ నటుడు మక్కల్ సెల్వన్ కూడా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే బాలయ్య నో చెప్పడంతో ఆ పాత్రలో సేతుపతి ఎంటర్ అవుతున్నాడా? లేక సేతుపతి కోసం రాసిన ప్రత్యేకమైన పాత్ర? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ వేటిని దర్శకుడు ముందే రివీల్ చేయడు. రిలీజ్ తర్వాత థియేటర్ లో చూసి సర్ ప్రైజ్ అవ్వడం తప్ప ముందే హింట్ ఇస్తేకిక్ పోతుంది. కాబట్టి గెస్ట్ అప్పిరియన్స్ పాత్రలేవి బయటకు రావు. కానీ `జైలర్` లో గత పాత్రల ఆధారంగా కొంత గెస్సింగ్ కి అవకాశం ఉంటుంది.
కథానాయకుడు రజనీకాంత్ ని మినహాయిస్తే? మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, కిషోర్, మకరన్ దేశ్ పాండే పాత్రలు ఏ రేంజ్ లో పండాయో తెలిసిందే. ఆ పాత్రలు తెరపై వచ్చినప్పుడు థియేటర్లో విజిల్స్ పడ్డాయి. అభిమానుల కేరింతలతో బాక్సులు బద్దలయ్యాయి. `జైలర్ 2` లోనూ ఆ రేంజ్ హైప్ ఎక్కడా మిస్ అవ్వదు. ఎస్. జె సూర్య ప్రధాన ప్రతినాయకుడు కావడంతో? ఆ రోల్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సెట్స్ లోన్న చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
