Begin typing your search above and press return to search.

బాలయ్య.. యువ దర్శకులకే ఎందుకీ ఛాన్సులు?

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కొత్త ప్లాన్ తో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. వరుస విజయాలతో ఫామ్‌ లో ఉన్న సమయంలో చాలామంది స్టార్ హీరోలు సేఫ్ జోన్‌ లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతారు.

By:  M Prashanth   |   1 Jun 2026 5:00 AM IST
బాలయ్య.. యువ దర్శకులకే ఎందుకీ ఛాన్సులు?
X

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కొత్త ప్లాన్ తో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. వరుస విజయాలతో ఫామ్‌ లో ఉన్న సమయంలో చాలామంది స్టార్ హీరోలు సేఫ్ జోన్‌ లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతారు. కానీ బాలయ్య మాత్రం అందుకు భిన్నంగా యువ దర్శకులకు ఇంపార్టెన్స్ ఇస్తూ కొత్త తరహా సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుత ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్లు విభిన్న కథలు, కొత్త ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

గత కొన్నేళ్లుగా బాలకృష్ణ కెరీర్ మంచి ఊపులో ఉంది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. అయితే ఇప్పుడు ఒకే తరహా కథలు సెలెక్ట్ చేయకుండా కొత్తదనానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం విశేషంగా మారింది. తన ఇమేజ్‌ ను కాపాడుకుంటూనే కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేనితో భారీ చిత్రాన్ని చేస్తున్నారు. వీరసింహారెడ్డితో హిట్ ఇచ్చిన దర్శకుడితోనే మరోసారి వర్క్ చేస్తూ సక్సెస్ ఫుల్ కాంబోను కంటిన్యూ చేస్తున్నారు. అదే సమయంలో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం కొత్త దర్శకుల ఆలోచనలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తన సెలెక్షన్ లో మార్పులు చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇప్పటికే తన రైటింగ్ స్కిల్, వినూత్న కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ బాలకృష్ణకు కథ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అలాగే దర్శకుడు విజయ్ కనకమేడల కూడా తన కథను వినిపించినట్లు వార్తలు వచ్చాయి. ఆ రెండు ప్రాజెక్టులు నిలిచిపోయాయని టాక్ వచ్చినప్పటికీ.. ఇప్పుడు వివేక్ ఆత్రేయతో సినిమా మళ్లీ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అదే సమయంలో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కూడా బాలకృష్ణకు ఓ కథ వినిపించినట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆ స్టోరీ బాలయ్యకు బాగా నచ్చిందట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు యువ దర్శకులపై బాలయ్య ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులేనని మూవీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కథలు, విభిన్న పాత్రలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. యువ దర్శకులు కూడా అలాంటి ఫ్రెష్ ఐడియాస్ తో ముందుకు వస్తుండటంతో స్టార్ హీరోలు వారి వైపు మొగ్గు చూపుతున్నారు. బాలకృష్ణ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తనకు సరిపోయే మాస్ ఎలిమెంట్స్ కొనసాగిస్తూనే కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

యువ దర్శకుల కథలకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా తన సినిమాలకు ఫ్రెష్ నెస్ తీసుకురావడంతో పాటు యువ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఏదేమైనా ఇప్పుడు బాలయ్య ఎక్స్పీరియన్సెడ్ డైరెక్టర్స్ తోపాటు యువ దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తూ కొత్త కథల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం బాలకృష్ణ సెలెక్షన్ ఆసక్తి రేకెత్తిస్తోంది.