NBK11: ఈసారి యుద్ధభూమిలో బాలయ్య
బాలకృష్ణ సినిమా అంటే సాధారణంగా ఫ్యాక్షన్ గొడవలు, లేదా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలే కళ్ల ముందు కదులుతాయి.
By: M Prashanth | 26 Nov 2025 12:01 PM ISTబాలకృష్ణ సినిమా అంటే సాధారణంగా ఫ్యాక్షన్ గొడవలు, లేదా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలే కళ్ల ముందు కదులుతాయి. కానీ ఈసారి సీన్ మొత్తం మారిపోయింది. ఈరోజు హైదరాబాద్ లో జరిగిన ఒక సినిమా ఓపెనింగ్ చూస్తుంటే.. మనం చూడబోయేది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని క్లియర్ గా అర్థమవుతోంది. అక్కడ రివీల్ చేసిన పోస్టర్లు, బాలయ్య ఉగ్రరూపం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
'వీరసింహారెడ్డి' లాంటి మాస్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని, ఈసారి బాలయ్యను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాడు. ఈరోజు ఘనంగా జరిగిన 'NBK111' ముహూర్తపు వేడుకలో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ ఆర్ట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సముద్రం, కోట గోడలు, యుద్ధ వాతావరణం చూస్తుంటే ఇదొక భారీ చారిత్రక అద్భుతంలా అనిపిస్తోంది.
ముఖ్యంగా పోస్టర్ లో బాలకృష్ణ గెటప్ నెవర్ బిఫోర్ అనేలా ఉంది. ఒక యోధుడి విగ్రహం రూపంలో ఉన్న బాలయ్య, చేతిలో రెండు వింతైన, పదునైన ఆయుధాలు పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే ఇది కేవలం మాస్ సినిమా మాత్రమే కాదు, ఒక "హిస్టారికల్ రోర్" అని దర్శకుడు గోపీచంద్ చెప్పిన మాట అక్షరాలా నిజం అనిపిస్తోంది.
ఈ పోస్టర్ లో బాలయ్యతో పాటు ఎదురుగా మరో రాజసం ఉట్టిపడే విగ్రహం కూడా ఉంది. ఆ లుక్ కూడా బాలయ్యకు మరో పాత్ర అనేలా ఉంది. బహుశా డ్యూయల్ రోల్ అయి ఉండొచ్చు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.
గోపీచంద్ మలినేని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తున్న సాహసం ఇది. "కొత్త ఆరంభం.. కొత్త బెంచ్ మార్క్" అంటూ డైరెక్టర్ ట్వీట్ చేయడం సినిమాపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ ను చూపిస్తోంది. ఇక సినిమాకు సంబంధించి పూర్తి టీమ్ గురించి మరికొన్ని రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.
మొత్తానికి ఈ ఓపెనింగ్ తోనే సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్లాయి. రెగ్యులర్ రొటీన్ కథలు కాకుండా, బాలయ్య బాబు ఇలాంటి వార్ డ్రామాని ఎంచుకోవడం ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇస్తోంది. ఈ యుద్ధంలో బాలయ్య చూపించబోయే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలంటే.. సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
