Begin typing your search above and press return to search.

NBK 111: బాలయ్యకు జోడీగా.. టైమ్ లాక్ చేసిన మేకర్స్!

నటసింహ నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసు దాటినా కూడా వరుస యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   2 Nov 2025 10:59 AM IST
NBK 111: బాలయ్యకు జోడీగా.. టైమ్ లాక్ చేసిన మేకర్స్!
X

నటసింహ నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసు దాటినా కూడా వరుస యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగు భాషలోనే సినిమాలు చేస్తూ ఆ సినిమాలను వివిధ భాషలలో కూడా డబ్బింగ్ చేస్తూ పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఈయన ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 రాబోతోంది. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ చిత్రం కూడా కావడం విశేషం. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇందులో బాలకృష్ణ అఘోర పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.





ఈ సినిమా తర్వాత బాలయ్య నటించబోయే ప్రాజెక్టు ఏంటి? అని అభిమానులు కూడా ఆసక్తి కనబరచగా NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వీర సింహారెడ్డి వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా అనడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో ఏ జానర్ లో రాబోతోంది? హీరోయిన్ ఎవరు ? అంటూ అభిమానులు కూడా ఆరా తీశారు. ఈ మేరకు చిత్ర బృందం ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయాన్ని రేపు రిలీజ్ చేస్తామని టైం కూడా లాక్ చేశారు.

విషయంలోకి వెళ్తే.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఎన్బికె 111 మూవీలో హీరోయిన్ ను రేపు వెల్లడిస్తామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. "రేపు మధ్యాహ్నం 12:01 గంటలకు చరిత్ర యుద్ధభూమి దాని రాణిని.. ఆమె పూర్తి వైభవంతో స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. సామ్రాజ్యం రేపు ఆమె గంభీరమైన, శక్తివంతమైన రాకను చూస్తుంది" అంటూ ఒక పోస్టర్ను పంచుకున్నారు. ఈ పోస్టర్లో బీభత్సమైన యుద్ధ భూమి పోరాటాన్ని చూపిస్తూ వెనుకల బ్యాక్ గ్రౌండ్లో వరల్డ్ మ్యాప్ చూపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే చారిత్రాత్మక మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది అని తెలుస్తుంది.

మరి హిస్టారికల్ మూవీ గా వస్తున్న ఈ సినిమాకి ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ రాజుగా.. నయనతార రాణిగా నటిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఇక రేపు మధ్యాహ్నం అసలు విషయాన్ని వెల్లడించనున్నారు చిత్ర బృందం . మరి ఎవరు మహారాణిగా ఇందులో నటించబోతున్నారో అధికారికంగా తెలియాలి అంటే రేపటి మధ్యాహ్నం వరకు ఎదురు చూడాల్సిందే.