Begin typing your search above and press return to search.

గన్ షాట్స్ కంటే డైలాగ్స్ హైలైట్ అవుతాయా? ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ పై హైప్

ఒక వీరాభిమాని అయిన దర్శకుడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించడానికి గోపీచంద్ మలినేని సిద్ధమవ్వడమే దీనికి కారణం.

By:  Madhu Reddy   |   29 May 2026 1:00 PM IST
గన్ షాట్స్ కంటే డైలాగ్స్ హైలైట్ అవుతాయా? ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ పై హైప్
X

టాలీవుడ్‌లో గ్లింప్స్ వీడియోలకి ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసిన సినిమా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’. ఆ రేంజ్ ఇంపాక్ట్‌ని మళ్లీ చూపించే గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ 'NBK 111' ఆ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతోంది. ఈ జూన్ 10న బాలయ్య పుట్టినరోజు కానుకగా రాబోతున్న ఫస్ట్ గ్లింప్స్ ట్రీట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక వీరాభిమాని అయిన దర్శకుడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించడానికి గోపీచంద్ మలినేని సిద్ధమవ్వడమే దీనికి కారణం.

లొకేషన్ ఒకటే.. ఇంపాక్ట్ మారేనా?:

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ గ్లింప్స్‌లో ముంబై పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌ను దర్శకుడు సుజీత్ చాలా స్టైలిష్‌గా, డార్క్ షేడ్‌లో చూపించి మైండ్ బ్లాక్ చేశారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. బాలయ్య 111 టీమ్ కూడా అదే ముంబై లొకేషన్లలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా కూడా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లోనే వస్తుండటంతో.. 'ఓజీ' తరహాలోనే సాలిడ్ అండ్ పవర్‌ఫుల్ విజువల్స్‌తో గోపీచంద్ మలినేని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తారా అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

ఫ్యాన్ బాయ్ డైరెక్షన్.. పూనకాలు లోడింగ్:

ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్యతో ఇప్పటికే 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్‌బస్టర్ కొట్టిన గోపీచంద్.. పక్కా ఫ్యాన్ బాయ్ డైరెక్టర్. ఒక అభిమానిగా తన హీరోని స్క్రీన్ మీద ఎలా చూడాలనుకుంటాడో.. ప్రేక్షకులకు కూడా అదే రేంజ్ విజువల్ ట్రీట్ ఇస్తాడు. బాలయ్య మాస్ ఇమేజ్‌ని, ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌ను ఆయన ఎలా ఎలివేట్ చేయబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలోనూ విపరీతంగా పెరిగిపోయింది.

గన్ షాట్స్ వర్సెస్ పవర్‌ఫుల్ డైలాగ్స్:

'ఓజీ' గ్లింప్స్‌లో గన్ షాట్స్, బ్లడ్ షేడ్ బాగా హైలైట్ అయ్యాయి. కానీ, బాలయ్య గ్లింప్స్‌లో అంతకు మించిన సర్‌ప్రైజ్ ఉండబోతోందని టాక్. ఇక్కడ గన్ షాట్స్ కంటే బాలయ్య చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీనే మెయిన్ హైలైట్ కానుందట. ఇక బాలయ్య నోట ముంబై గ్యాంగ్‌స్టర్ రేంజ్ డైలాగులు పడితే, థియేటర్లలో ఫ్యాన్స్ సీట్లలో కూర్చోవడం కష్టమే!

థమన్ బిజీఎం మ్యాజిక్: ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ థమనే వర్క్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే బాలయ్యకు 'అఖండ', 'వీరసింహారెడ్డి' సినిమాలతో పూనకాలు తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన థమన్.. ఈ ఫస్ట్ గ్లింప్స్ కోసం మరింత సాలిడ్ వర్క్ చేస్తున్నాడట. థమన్ ఇచ్చే థంపింగ్ మ్యూజిక్ ఈ గ్లింప్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

ఒక పెద్ద హీరోని, మరో ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తే వచ్చే కిక్కే వేరు. ఆ నమ్మకంతోనే బాలయ్య ఫ్యాన్స్ 'హిట్ కన్ఫామ్' అనే ధీమాతో ఉన్నారు. ఇక జూన్ 10న రాబోయే ఈ సాలిడ్ ట్రీట్ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, బాక్సాఫీస్ రికార్డులను ఎలా తిరగరాస్తుందో చూడాలి!