Begin typing your search above and press return to search.

NBK111: బాలయ్య రాజ్యంలో మరోసారి నయన్ 'క్వీన్'

నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న 'NBK111' నుంచి నిన్న వచ్చిన పోస్టర్ పెద్ద సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది.

By:  M Prashanth   |   18 Nov 2025 11:16 AM IST
NBK111: బాలయ్య రాజ్యంలో మరోసారి నయన్ క్వీన్
X

నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న 'NBK111' నుంచి నిన్న వచ్చిన పోస్టర్ పెద్ద సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. యుద్ధభూమి బ్యాక్‌డ్రాప్‌లో, ఒక పవర్ఫుల్ రాణి చాప్టర్ ఓపెన్ అవుతుందని ప్రకటించడంతో, ఆ క్వీన్ ఎవరాని ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చ మొదలైంది.

ఆ సస్పెన్స్‌కు ఈరోజు తెరపడింది. లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా, ఆమెనే ఆ 'క్వీన్' అని మేకర్స్ అఫీషియల్‌గా రివీల్ చేశారు. ఈ అనౌన్స్‌మెంట్ కోసం ఒక పవర్ ఫుల్ మోషన్ పోస్టర్‌ను కూడా వదిలారు. ఇది చూస్తుంటే, గోపిచంద్ మలినేని ఈసారి తన రెగ్యులర్ మాస్ ఫార్ములాను పక్కనపెట్టి, ఒక భారీ పీరియడ్ డ్రామాను ప్లాన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మోషన్ పోస్టర్‌లో, "గాడ్ ఆఫ్ మాసెస్, ది క్వీన్ మరోసారి కలుస్తున్నారు" అనే ట్యాగ్‌లైన్‌తో, బాలయ్య, నయన్‌లది హిట్ కాంబో అని హింట్ ఇచ్చారు. "ది క్వీన్ జాయిన్స్ ది ఎంపైర్" అంటూ నయనతార వారియర్ లుక్‌ను కూడా పరిచయం చేశారు. పాతకాలపు మ్యాప్, అగ్నికీలల మధ్య, యుద్ధభూమిలో నిల్చున్న నయన్ పోస్టర్ సినిమా జానర్‌పై ఒక క్లారిటీ ఇచ్చింది.

నయనతారను "సముద్రపు ప్రశాంతత, తుఫాను యొక్క ఉగ్రత" రెండూ కలగలిపిన రాణిగా అభివర్ణించారు. దీనికి "హిస్టారికల్ రోర్ లోడింగ్" అనే ట్యాగ్‌ను జోడించడంతో, ఇది పక్కా చారిత్రక యాక్షన్ డ్రామా అని ఫిక్స్ అవ్వొచ్చు. బాలయ్య, నయనతార కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జై సింహా' లాంటి సినిమాలతో హిట్స్ కొట్టారు.

ఈ అప్‌డేట్‌తో పాటు మేకర్స్ మరో రెండు కీలక విషయాలను కూడా ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం ఈ నెల, నవంబర్ 26న గ్రాండ్‌గా జరగనుందని తెలిపారు. అంతేకాదు, మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడంతో, ఈ సినిమాలో మరికొంతమంది పెద్ద స్టార్లు కూడా ఉండబోతున్నారని తెలుస్తోంది.

'వీరసింహారెడ్డి' లాంటి మాస్ హిట్ తర్వాత, అదే కాంబోలో ఇలాంటి హిస్టారికల్ డ్రామా రానుండటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా, బాలయ్య కెరీర్‌లో మరో డిఫరెంట్ సినిమాగా నిలిచేలా కనిపిస్తోంది.