Begin typing your search above and press return to search.

NBK 111.. మహారాజా బాలయ్య క్రేజీ అప్డేట్..!

ఇక ఎన్.బి.కె 111 సినిమా కూడా గోపీచంద్ మార్క్ మూవీగా ఉంటూనే ఈసారి భారీ ప్లానింగ్ తో వస్తున్నారట.

By:  Ramesh Boddu   |   27 Oct 2025 10:18 AM IST
NBK 111.. మహారాజా బాలయ్య క్రేజీ అప్డేట్..!
X

నందమూరి బాలకృష్ణ అఖండ 2 తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. జాత్ తో బాలీవుడ్ లో కూడా హిట్ అందుకున్న గోపీచంద్ ఈసారి బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. బాలకృష్ణ గోపీచంద్ ఈ కాంబినేషన్ ఆల్రెడీ వీర సిం హా రెడ్డి సినిమా చేశారు. ఆ సినిమా బాలయ్య ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ ఇచ్చింది. ఇన్నాళ్లు బాలయ్యతో ఊర మాస్ సినిమాలు కేవలం బోయపాటి శ్రీను మాత్రమే తీయగలడు అనుకున్న ఫ్యాన్స్ కి గోపీచంద్ సెకండ్ ఆప్షన్ అయ్యాడు.

బాలయ్యతో హిస్టారికల్ సినిమా నెక్స్ట్ లెవెల్ లో..

ఇక ఎన్.బి.కె 111 సినిమా కూడా గోపీచంద్ మార్క్ మూవీగా ఉంటూనే ఈసారి భారీ ప్లానింగ్ తో వస్తున్నారట. ఈ సినిమాను హిస్టారికల్ కథతో తెరకెక్కించబోతున్నారట. బాలయ్యతో హిస్టారికల్ సినిమా అంటే అది కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా నయనతారని ఎంపిక చేశారని తెలుస్తుంది. బాలయ్య నయనతార కాంబినేషన్ లో సింహా లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.

సిం హా తో పాటు జై సిం హా, శ్రీరామ రాజ్యం సినిమాల్లో బాలకృష్ణ నయనతార కలిసి నటించారు. సీనియర్ హీరోలకు నయనతార పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకుంటున్న టైం లో బాలయ్యతో ఏకంగా 3 సినిమాలు చేసింది. ఆ తర్వాత నర్తనశాల అనే సినిమా చేయాలని అనుకోగా అది కాస్త మధ్యలో ఆగిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ బాలకృష్ణతో నయనతార ఈసారి హిస్టారికల్ మూవీతో రాబోతున్నారు. సినిమాలో బాలయ్య మహారాజుగా కనిపిస్తాడని టాక్. సో రాజుగా బాలకృష్ణ మహారాణిగా నయనతార ఫ్యాన్స్ ని అలరిస్తారని చెప్పొచ్చు.

బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999..

ఈ సినిమా కథ, కథనాలు బాలయ్యకు బాగా నచ్చేశాయని తెలుస్తుంది. అఖండ 2 ఈ డిసెంబర్ కి వస్తుండగా గోపీచంద్ సినిమా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమా కూడా ప్లానింగ్ ఉంది.

కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది నయనతార. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాలో నటిస్తుంది అమ్మడు. ఇప్పుడు బాలయ్య 111 సినిమాకు ఫిక్స్ అయ్యింది. చూస్తుంటే మళ్లీ నయనతార టాలీవుడ్ లో మరోసారి తన ఫాం కొనసాగించేలా ఉంది. బాలయ్య, చిరంజీవితో పాటు నెక్స్ట్ నాగార్జున, వెంకటేష్ కూడా నయనతార తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.