Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ లా స‌త్తా చాటే ద‌మ్ము బాల‌య్య‌కే ఉందా!

భార‌తీయ చలనచిత్ర పరిశ్రమలో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించిన దిగ్గజ నటులలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు వరుసలో ఉంటారు.

By:  Srikanth Kontham   |   20 Oct 2026 6:00 AM IST
సూప‌ర్ స్టార్ లా స‌త్తా చాటే ద‌మ్ము బాల‌య్య‌కే ఉందా!
X

భార‌తీయ చలనచిత్ర పరిశ్రమలో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించిన దిగ్గజ నటులలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు వరుసలో ఉంటారు. 75 ఏళ్ల వయసులో రజనీకాంత్ `జైలర్` ప్రాంచైజీతో ఎలాంటి సంచ‌నాలు సృష్టిస్తున్నారో తెలిసిందే. అనవసరమైన ఫైట్లు, భారీ డ్యాన్సులు, రొమాంటిక్ ట్రాక్స్ లేకుండా కేవలం తనదైన స్వాగ్.. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించారు. రజనీలాగే టాలీవుడ్‌లోనూ అలాంటి ప్రత్యేకమైన స్వాగ్‌తో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించగల సత్తా బాలయ్యకు ఉందనడంలో అతిశ‌యోక్తి లేదు.

తెలుగు తెర‌పై బాలకృష్ణ మాస్ అటిట్యూడ్ మరే ఇతర హీరోకూ సాధ్యం కాని రీతిలో ఉంటుంది. తొడగొట్టి రన్నింగ్ ట్రైన్‌ను ఆపడం.. చిటికేస్తే కుర్చీ ముందుకు రావడం.. వంద మంది శత్రువులను ఒకేసారి గొడ్డలితో తెగనరకడం.. కళ్లెర్రజేస్తే విలన్లు భయంతో వణికిపోవడం వంటి పవర్‌ఫుల్ సన్నివేశాలు బాలయ్యకే పూర్తిగా సరిపోతాయి. ఈ తరహా మాస్ ఎలివేషన్స్ మరే ఇతర హీరో చేసినా? అతిగా అనిపించవచ్చు కానీ బాలయ్య స్క్రీన్ మీద చేస్తే మాత్రం వంద శాతం కన్విన్సింగ్‌గా అనిపిస్తుంది. ఆయనకున్న ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ ఆ సీన్లకు ప్రాణం పోస్తాయి.

అయితే మారుతున్న కాలానికి తగినట్లుగా నేటి ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా బాలయ్యను ప్రెజెంట్ చేస్తే ఫలితం మరోలా ఉంటుంది. రజనీకాంత్ `జైలర్` చిత్రంలో చేసినట్లుగానే బాలయ్యలోని వయసుకు తగ్గ పరిణతిని, ఆయన ఏజ్‌లెస్ స్వాగ్‌ను హైలైట్ చేస్తూ ఓ పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలి. అనవసరమైన హంగులకు పోకుండా బాల‌ ఇమేజ్‌కు సరిపోయే ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్.. పవర్ ఫుల్ ఎలివేషన్స్ ఇస్తే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం.

ఈ తరహా సాహసోపేతమైన ప్రయోగాన్ని తెరపైకి తీసుకురావాలంటే బాలయ్యను పూర్తిగా అర్థం చేసుకుని ఆయన ఇమేజ్‌ను సరికొత్త కోణంలో చూపించగల సమర్థుడైన దర్శకుడు కావాలి. మాస్ డైరెక్షన్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న బోయపాటి శ్రీను వంటి వారు మాత్రమే ఇలాంటి మాస్ స్వాగ్‌ను పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరు. మాస్ జోనర్‌కే పరిమితం కాకుండా ప్రశాంత్ నీల్ .. లోకేష్ కనగరాజ్ వంటి న్యూ ఏజ్ దర్శకుల స్టైలిష్ టేకింగ్‌తో బాలయ్యను చూపిస్తే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలందరూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో బాలయ్య వయసుకు, ఇమేజ్‌కు సరిపోయేలా కథలను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే బాల‌య్య ప్రదర్శిస్తున్న ఉత్సాహం, నటనపై చూపిస్తున్న అంకితభావం యువ హీరోలకు సైతం పోటీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ సృష్టించిన ట్రెండ్‌ను అనుకరించడమే కాకుండా దాన్ని తెలుగు నేటివిటీకి తగినట్లుగా మలచి బాలయ్యతో అద్భుతం సృష్టిస్తే అది టాలీవుడ్‌లో రికార్డులను బద్దలు కొట్టడం పక్కా.

చివ‌రిగా బాలయ్యలోని అసలైన మాస్ అటిట్యూడ్‌ను, ఆయన వయసుకు తగిన స్వాగ్‌ను పర్ఫెక్ట్ డైరెక్టర్ చేతిలో పెడితే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించవచ్చు. అభిమానులకు కావాల్సిన ఊరమాస్ ఎలిమెంట్స్‌తో పాటు.. సరికొత్త స్టైలిష్ ప్రెజెంటేషన్‌ను జోడిస్తే బాలయ్య కెరీర్‌లో మైలురాయి చిత్రంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.