Begin typing your search above and press return to search.

ఎలివేష‌న్లు త‌గ్గించి కంటెంట్ తో కొట్టేలా!

న‌ట‌సింహ బాల‌కృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. క‌థ ఎలా ఉన్నా? బాల‌య్య ఎలివేష‌న్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డానికి వీలు లేదు.

By:  Srikanth Kontham   |   26 Jan 2026 12:00 PM IST
ఎలివేష‌న్లు త‌గ్గించి కంటెంట్ తో కొట్టేలా!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. క‌థ ఎలా ఉన్నా? బాల‌య్య ఎలివేష‌న్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డానికి వీలు లేదు. ఆయ‌న స్వాగ్ ని తప్ప‌క హైలైట్ చేయాల్సిందే. ఈ విష‌యంలో బాల‌య్య ఎంత మాత్రం రాజీ ప‌డ‌రు. ఆయ‌న సినిమాకు స్టోరీ విని క‌మిట్ అయినా? విన‌కుండా క‌మిట్ అయినా? ఎలివేష‌న్ విష‌యంలో మాత్రం డైరెక్ట‌ర్ ఫిక్సైపోయి ఉండాల్సిందే. బాల‌య్య యాక్ష‌న్ సీన్ లో ఉన్నారంటే అత‌డు మాత్ర‌మే హైలైట్ అవ్వాలి. ప్ర‌త్య‌ర్ధి ఎంత శంక్తివంతుడైనా స‌రే అందులో బాల‌య్య మాత్ర‌మే క‌నిపించాలి.

కాద‌ని మ‌రో న‌టుడు అక్క‌డ హైలైట్ అవ్వ‌డానికి వీలుండ‌దు. బాల‌య్య తో ప‌నిచేసే ద‌ర్శ‌కులు కూడా ఆ ర‌కంగా ముందుగానే సిద్ద‌ప‌డి ప‌ని చేస్తారు. ఇవే అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని బోయ‌పాటి శ్రీను `అఖండ 2` ను తీసాడు? అన్న‌ది క్లియ‌ర్ . కానీ ఈ సినిమా ఫ‌లితంతో సీన్ అంతా మారిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈసారి ఎలివేష‌న్లు త‌గ్గించి కంటెంట్ తో కొట్టాలే ఉండాల‌ని బాల‌య్య నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు అందిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. బాల‌య్య 111వ సినిమా విష‌యంలో కొంత హైడ్రామా న‌డిచిన సంగ‌తి తెలిసిందే. తొలుత గోపీచంద్ మ‌లినేని వినిపించిన స్క్రిప్ట్ భారీ బ‌డ్జెట్ డిమాండ్ చేయ‌డం...బాల‌య్య‌కు అంత మార్కెట్ లేక‌పోవ‌డంతో నిర్మాత రిస్క్ కు తీసుకోవ‌డానికి వెనుకాడాడు.

దీంతో గోపీచంద్ క‌థ‌నే మార్చేసాడు. ఓ కొత్త క‌థ‌తో బాల‌య్య తో ముందుకెళ్తున్నాడు. ఆస్టోరీ లైన్ ఏంటి? అన్న‌ది లీక్ అయింది. ఓ పవర్‌ఫుల్ ముంబై బ్యాక్‌డ్రాప్ గ్యాంగ్ స్టర్ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో బాల‌య్య పాత్ర‌ల‌ను బ‌లంగా చూపించ‌బోతున్నాడుట‌. యాక్ష‌న్ ప‌రంగా ఎలివేష‌న్ ఇవ్వాల్సిన చోట ఇస్తూనే త‌గ్గించాల్సిన చోట త‌గ్గిస్తున్నాడుట‌. ఈ విష‌యంలో బాల‌య్య కూడా సంతృప్తిగానే ఉన్నారుట‌. గోపీచంద్ గ‌తంలో చేసిన త‌ప్పిదాల‌ను ఈసారి పున‌రావృతం కాకుండా ముందే జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజ‌యాన్నే సాధించింది. కానీ స్క్రీన్ ప్లే పరంగా విమర్శలు ఎదుర్కొంది. రెగ్యుల‌ర్ పేట్ర‌న్ లోనే క‌థ‌నం సాగింది. ప్రేక్ష‌కాభిమానుల‌కు ఏమాత్రం ఎగ్జైట్ మెంట్ తీసుకురాలేదు. క‌థ‌నం ప‌రంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బాగుండేది అనే మాట వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో గోపీచంద్ ఈసారి అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌తో రెడీ అవుతున్నాడు. కేవలం ఎలివేషన్ల మీద ఆధార పడకుండా, కథలో దమ్ము ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంది.