యమా స్టైలిష్ గా కొరటాల హీరోలు.. మరి బాలయ్య?
దర్శకుడు కొరటాల శివ సినిమాల్లో హీరోల ప్రజెంటేషన్ ఎప్పుడూ స్పెషలే. కథ, సామాజిక నేపథ్యం, ఎమోషన్స్ తో పాటు హీరోను స్టైలిష్ గా చూపించడంపైనా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు.
By: M Prashanth | 4 July 2026 3:22 PM ISTదర్శకుడు కొరటాల శివ సినిమాల్లో హీరోల ప్రజెంటేషన్ ఎప్పుడూ స్పెషలే. కథ, సామాజిక నేపథ్యం, ఎమోషన్స్ తో పాటు హీరోను స్టైలిష్ గా చూపించడంపైనా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. గతంలో ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలను తనదైన శైలిలో చూపించి అభిమానులను మెప్పించారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతుండటంతో ఆయనను కొరటాల ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్‌తో కొరటాల సినిమాలు చేసిన సమయంలో వారి లుక్స్, బాడీ లాంగ్వేజ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కథలోని రోల్ కు తగ్గట్టుగా చేంజెస్ చేస్తూనే హీరోల ఇమేజ్ కు సరిపోయేలా ప్రజెంట్ చేశారు. దీంతో కొరటాల సినిమాల్లో హీరోల లుక్స్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు బాలయ్య విషయంలోనూ అదే తరహా ఆసక్తి కనిపిస్తోంది. అయితే గతంలో కొరటాల పనిచేసిన హీరోలతో పోలిస్తే బాలకృష్ణ సీనియర్ హీరో. పైగా ఆయనకు ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ఉంది.
యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్ ను బాలయ్య అభిమానులు ఎక్కువగా కోరుకుంటారు. దీంతో ఆయనను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తూనే, ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ స్టైలిష్ గా చూపించినా పాత్రకు సెట్ కాకపోవచ్చు. అలాగని రెగ్యులర్ లుక్‌లోనే చూపిస్తే కొత్తదనం కనిపించదు. ఈ రెండింటి మధ్య కొరటాల ఎలాంటి బ్యాలెన్స్ పాటిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక సినిమాలో బాలకృష్ణ కొత్త మేకోవర్ లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కొరటాల స్టోరీకి తగ్గట్టుగా ఆయన లుక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లో చేంజెస్ ఉండనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని పవర్ ఫుల్ గా చూపిస్తూనే, తన మార్కు స్టైలిష్ ప్రజెంటేషన్ ను కొరటాల జోడించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మరోవైపు ఈ సినిమా కథ విషయంలోనూ పలు ప్రచారాలు జరుగుతున్నాయి.
రాయలసీమ నేపథ్యంతో పాటు అక్కడి నీటి సమస్యలను ప్రధానంగా తీసుకుని కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పాత్రకు మాఫియా నేపథ్యం ఉంటుందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, సామాజిక అంశాలను కలిపి కొరటాల తనదైన శైలిలో కథను రూపొందించినట్లు తెలుస్తోంది. సాధారణంగా కొరటాల మూవీల్లో హీరో రోల్స్ కథలో భాగంగానే కనిపిస్తాయి. మాస్ ఎలివేషన్స్ ఉన్నప్పటికీ వాటికి స్టోరీతో సంబంధం ఉండేలా చూసుకుంటారు.
ఇప్పుడు బాలయ్య విషయంలోనూ ఇదే ఫార్ములాను అనుసరించే అవకాశం ఉంది. ఆయన మాస్ ఇమేజ్ ను తగ్గించకుండా, వయసుకు తగిన విధంగా స్టైలిష్ గా చూపించడం కొరటాల ముందున్న ప్రధాన సవాల్ గా కనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పటికే పలువురు హీరోలను స్టైలిష్ గా చూపించిన కొరటాల.. ఇప్పుడు బాలయ్యకు ఎలాంటి లుక్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ హీరో అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మరీ ఓవర్ గా కాకుండా, అదే సమయంలో అభిమానులను నిరాశపరచకుండా బాలయ్యను కొత్తగా చూపించాల్సి ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.
