బసవతారకం ఆస్పత్రి టాప్ సీక్రెట్ లీక్ చేసిన బాలయ్య
నటసింహా నందమూరి బాలకృష్ణ 50 వసంతాల కెరీర్ ని పురస్కరించుకుని నటుడిగా ఆయన సాధించిన ఈ ఘనతకు గాను `లండన్ - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్`లో చోటు దక్కిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 1 Sept 2025 12:12 AM ISTనటసింహా నందమూరి బాలకృష్ణ 50 వసంతాల కెరీర్ ని పురస్కరించుకుని నటుడిగా ఆయన సాధించిన ఈ ఘనతకు గాను `లండన్ - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్`లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన సన్మాన సభలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్‌ని బహిర్గతం చేసారు. బసవతారకంలో ఒక ఇన్నోవేషన్ గురించి ఆయన చెప్పిన డీటెయిల్ నిజంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
క్యాన్సర్ ఆప్రత్రిలో 'సైక్లోట్రాన్' అనే ఎక్విప్ మెంట్ ఉంది. ఎఫ్.టి.జి (రా మెటీరియల్) అని పిలుస్తాం. రేడియోషన్ రిలేటెడ్ రా మెటీరియల్ ని మేమే తయారు చేసుకుంటాం. ఈ రామెటీరియల్ ఇతర ఆస్పత్రులకు కూడా అమ్ముతుంటాం. అటువంటి రా మెటీరియల్‌ని నేను. నా దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, ఛాంబర్, మూవీ ఆర్టిస్టుల సంఘం(మా), ఫెడరేషన్ , కౌన్సిల్ సహాయ సహకారాలతోనే నేను హీరోగా ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని అనుకుంటున్నాను! అని అన్నారు.
మొత్తానికి తనను తాను ఒక `రా మెటీరియల్` అని నిజాయితీగా అంగీకరించడానికి సంకోచించని ఎన్బీకే నిజాయితీ పెద్ద చర్చగా మారింది. ఆయనను దర్శకుల హీరో అని అంటారు అందుకే! అంతేకాదు.. తన దర్శకనిర్మాతల కారణంగా, పరిశ్రమ ప్రోత్సాహం కారణంగా తాను హీరోగా నిలదొక్కుకున్నానని కూడా ఆయన స్పష్టంగా అనడం ఆకట్టుకుంది. నిజానికి పరిశ్రమలో ఒక అగ్ర హీరో ఇంత నిజాయితీగా, సూటిగా మాట్లాడటం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది. బాలయ్య బాబు భోళాగా మాట్లాడేస్తారు! అంటే ఇదేనేమో!!
