Begin typing your search above and press return to search.

కొరటాల మూవీకి అఖండ సెంటిమెంట్ రిపీట్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'దాదా' షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది.

By:  Ramesh Palla   |   26 Oct 2026 10:37 AM IST
కొరటాల మూవీకి అఖండ సెంటిమెంట్ రిపీట్..!
X

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'దాదా' షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా దాదా రావడం కన్ఫర్మ్‌ అయింది. భారీ అంచనాల నడుమ రూపొందిన దాదా సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దాదా తర్వాత బాలకృష్ణ చేయాల్సిన సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయింది. యాక్షన్‌ సినిమాలతో ఆకట్టుకునే కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ పట్టాలెక్కబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. వీరి కాంబో మూవీకి ఎన్‌బీకే 112 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందబోతుంది. దాదా షూటింగ్‌ పూర్తి కావడంతో ఇప్పుడు అంతా వీరి కాంబో మూవీ షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా వీరి కాంబో మూవీ షూటింగ్‌ డేట్‌ ఫిక్స్ అయింది.

దాదా షూటింగ్‌ తర్వాత కొరటాల శివకు...

దాదా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా కొరటాల శివకు బాలకృష్ణ డేట్లు ఇవ్వబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే నవంబర్‌ రెండో వారంలో షూటింగ్‌ మొదలు కాబోతుంది. కాస్త అటు ఇటు అయినా నవంబర్‌ చివరి వరకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఒకవైపు షూటింగ్‌ ప్రారంభించేందుకు సెట్‌ వర్క్ చేయిస్తూనే మరో వైపు సినిమాలో నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్తా మీనన్‌ ను ఎంపిక చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి కాంబోలో ఇప్పటికే అఖండ 2 సినిమా వచ్చిన విషయం తెల్సిందే. మళ్లీ ఇప్పుడు కొరటాల శివ కోసం ఈ కాంబో రిపీట్‌ కాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

బాలకృష్ణ అఖండ 2 హీరోయిన్‌తో...

సాధారణంగా బాలకృష్ణకు హిట్‌ కాంబినేషన్‌లు కలిసి వస్తాయి. ఒకసారి ఒకరితో హిట్‌ కొడితే వారిని రిపీట్‌ చేస్తే కచ్చితంగా మరో విజయం దక్కుతుంది. అందుకే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో అఖండ 2 హీరోయిన్‌ సంయుక్తా మీనన్‌ ను రిపీట్‌ చేయడం ద్వారా కచ్చితంగా మంచి ఫలితం దక్కుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అఖండ హిట్‌ సెంటిమెంట్‌ కనుక ఎన్‌బీకే 112 సినిమా సైతం తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని బాలయ్య అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ సైతం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆ హీరోయిన్‌ కోసం ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ హీరోయిన్‌ సైతం ఫైనల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఐటెం సాంగ్‌ కోసం ఒక ముద్దుగుమ్మ ఈ సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.

NBK112 సినిమాలో సంయుక్తా మీనన్‌...

మొత్తానికి ఎన్‌బీకే 112 సినిమాలో ఫుల్‌ ఆఫ్‌ కలర్‌ ఫుల్‌ బ్యూటీస్‌ ఉండబోతున్నారు. ఒక వైపు ముద్దుగుమ్మలు ఉంటూనే మరో వైపు బాలకృష్ణ మార్క్‌ మాస్‌ ఎలివేషన్స్‌, కొరటాల శివ మార్క్‌ మాస్‌ యాక్షన్‌ సీన్స్ చాలానే ఉంటాయనే నమ్మకం ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా దసరా వరకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నాడు. కెరీర్‌ పరంగా కొరటాల శివ కాస్త ఇబ్బందులు ఎర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన బాలకృష్ణతో చేస్తున్న ఈ సినిమా హిట్‌ అయితే మళ్లీ ఆయన వెనుక స్టార్‌ హీరోలు తమతో సినిమాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కొరటాల శివ ఈ సినిమాతో తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. గత చిత్రాల ఫ్లాప్స్‌ నుంచి బయట పడాలి అంటే బాలయ్యతో చేయబోతున్న ఈ సినిమా హిట్‌ కావాల్సిందే. కనుక కచ్చితంగా కొరటాల శివ గట్టి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ ప్రయత్నాలు ఎంత వరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి.