Begin typing your search above and press return to search.

బాలయ్య మాస్ ఇమేజ్‌కు కొరటాల క్లాస్ టచ్!

నటసింహం బాలకృష్ణ - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   23 Sept 2026 5:00 AM IST
బాలయ్య మాస్ ఇమేజ్‌కు కొరటాల క్లాస్ టచ్!
X

నటసింహం బాలకృష్ణ - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య మాస్ ఇమేజ్ కి కొర‌టాల క్లాస్ ట‌చ్ అయితే ఎలా ఉంటుందో చూడాల‌ని ప్రేక్ష‌కాభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొరటాల శైలి మిగతా కమర్షియల్ దర్శకులకు పూర్తిగా భిన్నమైనది. ఆయన తన ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని లేదా సున్నితమైన సమస్యను ఎంచుకుని దానికి పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలను జోడించడంలో సిద్ధహస్తుడు.

`శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`,`భారత్ అనే నేను` వంటి చిత్రాల్లో హీరోల మాస్ ఇమేజ్‌ను ఏమాత్రం త‌గ్గ‌కుండానే? వారి పాత్రలకు బాధ్యతాయుతమైన ఉద్దేశాన్ని ఆపాదించారు. ఈ విధానంతో ఆయా నటుల కెరీర్‌లో ఓ కొత్త ఇమేజ్‌తో పాటు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. మ‌రోవైపు బాలకృష్ణ మాస్ నటనకు, హై-వోల్టేజ్ డైలాగ్ డెలివరీకి చిరునామా. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` వంటి చిత్రాలతో ఆయన మాస్ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో మెప్పించారో? తెలిసిందే.

అయితే కొరటాల శివతో చేసే సినిమాలో బాలయ్య పాత్ర ఎలా ఉంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. రౌద్రంతో కూడిన మాస్ పాత్రలు చేసే బాలకృష్ణలోని కొత్త కోణాన్ని సెన్సిటివ్ పాయింట్‌తో కమర్షియలైజ్ చేసి చూపించేలా కొరటాల ముందుకెళ్తున్నారు. సాధారణంగా కొరటాల సినిమాల్లో నటుల నుంచి ఆవేశం మాత్రమే కాకుండా ఆలోచన రేకెత్తించే భావోద్వేగాలు హైలైట్ అవుతాయి. బాలకృష్ణ నటనా సామర్థ్యాన్ని, తీవ్రతను సామాజిక ఉద్దేశం వైపు మళ్లిస్తే అది వెండితెరపై వినూత్నంగా ఉంటుంది. ఊరమాస్ అంశాలతో పాటు సమాజానికి మేలు చేసే బలమైన ఆశయం కోసం పోరాడే నాయకుడిగా బాలయ్యను చూపిస్తే? అది బాల‌య్య‌ కెరీర్‌లో ఇప్పటివరకు చూడని సరికొత్త క్లాస్ అండ్ మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెడుతుంది.

ఏది ఏమైనా పక్కా మాస్ అంశాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన బాల‌య్య‌ను సందేశాత్మక కమర్షియల్ చిత్రాల మాస్టర్ అయిన కొరటాల శివ ఎలా ఆవిష్కరిస్తారనేది? ఆస‌క్తిక‌రం. సెన్సిటివ్ పవర్‌ఫుల్ పాయింట్‌తో బాలయ్యలోని కొత్త కోణాన్ని బయటకు తీస్తే అది తెలుగు సినిమా మేకింగ్‌లోనే కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవడం ఖాయం. ఈ అరుదైన కలయిక బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.