కొరటాల ప్లాన్ మామూలు కాదు.. బాలయ్యకు ఎదురుగా పవర్‌ఫుల్ విలన్!
ఇక రాజశేఖర్ కెరీర్ పరంగా చూసినా ఈ సినిమా అతని కెరీర్లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.
By: Sravani Lakshmi Srungarapu | 7 Jun 2026 12:54 PM ISTనందమూరి బాలకృష్ణ- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా గురించి అధికారిక ప్రకటన రాకముందే ఇండస్ట్రీలో భారీ చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచేలా తాజాగా మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తకు సంబంధించి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినా, టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా హీరోగా ఎన్నో సక్సెస్‌లు అందుకున్న రాజశేఖర్, బాలయ్యకు ఎదురుగా పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తే అది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు విలన్ పాత్ర గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
కొరటాల శివ గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా బలమైన పాత్రలతో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కథలో విలన్ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని, అదే సినిమాకు ప్రధాన బలంగా నిలవబోతుందని టాక్ వినిపిస్తోంది. అందుకే ఆ క్యారెక్టర్ కోసం రాజశేఖర్ వంటి అనుభవజ్ఞుడైన నటుడిని ఎంపిక చేయాలనే ఆలోచన జరిగినట్లు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే, బాలయ్య- రాజశేఖర్ మధ్య సాగే పోరాటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. హీరో- విలన్ మధ్య సమాన స్థాయిలో సీన్స్ ఉండేలా కొరటాల స్క్రీన్‌ప్లే రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇక రాజశేఖర్ కెరీర్ పరంగా చూసినా ఈ సినిమా అతని కెరీర్లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఆయనకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. అయితే నటుడిగా తన సామర్థ్యాన్ని ఎన్నోసార్లు నిరూపించుకున్న రాజశేఖర్‌కు ఒక బలమైన విలన్ క్యారెక్టర్ దొరికితే కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల టాలవుడ్ లో హీరోల నుంచి విలన్‌లుగా మారిన పలువురు నటులు కొత్త స్థాయికి చేరుకున్న ఉదాహరణలున్నాయి. అదే తరహాలో రాజశేఖర్ కూడా ఈ సినిమాతో తన కెరీర్‌కు కొత్త దిశను ఇవ్వగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా పలువురు చూస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాలో బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని సమాచారం. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో మాఫియా నేపథ్యంతో సాగే పాత్రలో ఆయన కనిపిస్తారని, పూర్తి స్థాయి మాస్ అవతార్‌ను కొరటాల శివ డిజైన్ చేశారని తెలుస్తోంది. అదే సమయంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా పెద్దపీట వేస్తూ కథను రూపొందించారనే వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ యాక్షన్, స్ట్రాంగ్ ఎమోషన్స్, పవర్‌ఫుల్ విలన్, బాలయ్య కొత్త లుక్ వంటి అంశాలు కలిసి ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. దేవర తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆయన కూడా కథ, పాత్రల రూపకల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. ఆగస్టులో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు నిజమైతే మాత్రం బాలయ్య సినిమాకు అసలైన హైలైట్ విలన్ పాత్రే అవుతుందనే అభిప్రాయం బలపడుతోంది.
