Begin typing your search above and press return to search.

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం దాదా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలయ్య, అది పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు తనదైన క్లాస్ ట్రీట్‌మెంట్ జోడించి కథ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే అవకాశం ఉందని టాక్.

By:  Srikanth Kontham   |   8 Nov 2026 6:00 PM IST
క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బాల‌య్య `దాదా` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మ‌రికొన్ని రోజుల్లో ఆ సినిమా షూట్ ముగించుకుని బ‌య‌ట‌కు రానున్నారు. అనంత‌రం కొర‌టాల చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కొర‌టాల సింహం కోసం ఎలాంటి క‌థ రాసి ఉంటారు? ఎలాంటి పాయింట్ తీసుకుని ఉంటారు? దానికి కొర‌టాల మార్క్ మాస్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుంది? అన్న దానిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. `ఆచార్య` మిన‌హా ఇప్ప‌టివ‌ర‌కూ కొర‌టాల తెర క్కించిన అన్ని సినిమాలు మంచి విజ‌యాలు సాధించిన‌వే.

`మిర్చి` నుంచి `దేవ‌ర` వ‌ర‌కూ ప్ర‌తీ క‌థ‌లోనూ త‌న‌దైన క్లాసిక్ స్టైల్ అండ్ ఓ రేంజ్లో హైలైట్ అయింది. హీరో పాత్ర బ్యాలెన్స్ గా చెబుతూనే అవ‌స‌రం మేర ఒక్క‌సారిగా మాస్ అప్పిరియ‌న్స్ తో పైకి లేప‌డంలో కొర‌టాల మాస్ట‌ర్. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య కోసం కొర‌టాల అదే పార్మెట్ ను అనుస‌రించే అవ‌కాశం క‌నిపిస్తుంది. అయితే స్టోరీ ప‌రంగా గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఉన్నా? పాత్ర‌ల ప‌రంగా పాత విధాన‌మే అనుస‌రించే అవ‌కాశం ఉంది. అందుకు బాల‌య్య మాస్ ఇమేజ్ యాడ్ అవుతుంది? కాబ‌ట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్ ప్ల‌స్ క్లాస్ కంటెంట్ నే సిద్దం చేసి ఉంటార‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి గ‌తంలో రాసిన ఓ ప‌వ‌ర్ పుల్ క‌థ కొర‌టాల‌దే అన్న ప్ర‌చారం గ‌తంలో జ‌రిగింది. బాల‌య్య‌కు స‌రికొత్త మాస్ ఇమేజ్ ను అత‌డే తీసుకురావాల‌ని ఎంతో ఇష్ట‌ప‌డి ఆ క‌థ రాస‌ర‌ని అంటారు. కానీ కొన్ని కార‌ణాల‌తో అది చేతులు మార‌డంతో కొర‌టాల డ్రీమ్ అప్ప‌టి నుంచి అలాగే ఉండిపోయింది. ఇప్పుడా ఛాన్స్ కొర‌టాల‌కు రావ‌డంతో? విశ్వ‌రూపం చూపించే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. కొర‌టాల క్లాసిక్ ఐడియాకి బాల‌య్య మాస్ ఇమేజ్ తోడైతే ఆ ర‌చ్చ ఏ రేంజ్లో ఉంటుందో? ఊహ‌కే అంద‌దు. పైగా కొర‌టాల స‌క్సెస్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.

`దేవ‌ర` రూపంలో కొన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. చిరంజీవితో తీసిన `ఆచార్య` కూడా ప్లాప్ అవ్వ‌డంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఇప్పుడా లెక్క‌ల‌న్నీ బాల‌య్య రూపంలో స‌రిచేసే అవ‌కాశం కొర‌టాల‌కు ద‌క్కింది. పైగా ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్లు అంతా పాన్ ఇండియా మోజులో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య కోసం రాసిన క‌థ‌ను పాన్ ఇండియాకు క‌నెక్ట్ అయ్యేలా డిజైన్ చేసి ఉండే అవ‌కాశాలు లేక‌పోలేదు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.