నిజమే అయితే అది ప్రభంజనమే!
నటసింహ బాలకృష్ణ మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండి తెరపై సింహం గర్జనకే థియేటర్లు దద్దరిల్లిపోతాయి.
By: Srikanth Kontham | 18 April 2026 3:02 PM ISTనటసింహ బాలకృష్ణ మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండి తెరపై సింహం గర్జనకే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఆయన ఇమేజ్ కు తగ్గ మాస్ కంటెంట్ పడిందంటే? బాక్సాపీస్ వద్ద కోత మామూలుగా ఉండదు. పాత రోజుల్లో సీమ కథలతో హైలైట్ అయితే ..తర్వాత కాలంలో బోయపాటి తప్ప బాలయ్య ను ఆ రేంజ్ లో ఇంత వరకూ మరో డైరెక్టర్ లో హైలైట్ చేయలేదు. అలాంటి మాస్ పవర్ హౌస్‌కు ఇప్పుడు రెట్టించిన మాస్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ తోడవుతున్నట్లు కనిపిస్తోంది. అతడే కొరలాల శివ. ఇతడి కథలు, మాస్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.
సామాజిక అంశాలను మాస్ ఎలిమెంట్స్‌తో జోడించి చెప్పే కొరటాల శివ విజన్ తోడైతే? అది సినిమా కాదు ప్రభంజనమే అవుతుంది. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఈ సంచలన కాంబినేషన్ వార్త నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. వాస్తవానికి బాలయ్యను వెండితెరపై సరికొత్త కోణంలో ఆవిష్కరిం చాలని కొరటాల శివ చాలా ఏళ్ల క్రితమే భావించారు. కొరటాల దర్శకుడిగా మారకముందు, రచయితగా ఉన్న సమయంలోనే బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసారు. కానీ వివిధ కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
ఆ తర్వాత కాలంలో బాలయ్యను మరో డైరెక్టర్ అదే రేంజ్ లో కొంత వరకూ హైలైట్ చేసాడు. అదంతా పక్కన బెడితే? ఇప్పుడా కాలం కలిసి రావడంతో ఆ పాత కలని కొత్తగా నిజం చేసేందుకు కొరటాల మళ్ళీ బాలయ్య వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిజంగా ఈ క్రేజీ కాంబో సెట్ అయితే వెండితెరపై సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు అభిమానులు. కొరటాల శివ సినిమాల్లో హీరోలు ఎంతో హుందాగా, బలమైన ఆశయం కోసం పోరాడే వ్యక్తులుగా కనిపిస్తారు. బాలయ్య మాస్ పవర్‌ను కొరటాల తన క్లాస్ మేకింగ్‌తో మిక్స్ చేస్తే ఆ అవుట్‌పుట్ అద్భుతంగా ఉంటుంది.
సాధారణంగా బాలయ్య సినిమాలు హై-వోల్టేజ్ యాక్షన్‌తో నిండి ఉంటాయి. దానికి కొరటాల మార్క్ ఎమోషన్ - సోషల్ మెసేజ్ తోడైతే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒకేసారి రెండు సింహాలు గర్జిస్తే థియేటర్ల వద్ద ఆ సౌండ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహకే అందదు. ప్రస్తుతం బాలకృష్ణ వరుసగా కొత్త చిత్రాలు కమిట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖంగా యువ దర్శకులతో జోడీ కడుతున్నారు. కొరటాల సీన్ లో కి వస్తే గనుక వారందర్నీ బాలయ్య హోల్డ్ లో పెట్టి ముందుగా కొరటాలతోనే సినిమా చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బాలయ్య ఇప్పటికే గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు. కొరటాలతో కుదిరితే? గోపీ తర్వాత కొరటాల ప్రాజెక్ట్ ఉంటుంది. కోరటాల తెరకెక్కించాల్సిన `దేవర2` కి మరింత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే కొరటాల కూడా బాలయ్య వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
