Begin typing your search above and press return to search.

క్లాస్ మెసేజ్.. మాస్ ఊరనాటు యాక్షన్.. బాలయ్య-కొరటాల 'కత్తి మీద సాము' వర్కవుట్ అవుతుందా?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా సిద్ధమవుతోంది.

By:  Madhu Reddy   |   19 July 2026 5:03 PM IST
క్లాస్ మెసేజ్.. మాస్ ఊరనాటు యాక్షన్.. బాలయ్య-కొరటాల కత్తి మీద సాము వర్కవుట్ అవుతుందా?
X

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి 'కార్పెంటర్' అనే క్రేజీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుండి సినీ విశ్లేషకుల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కొరటాల మార్క్ సామాజిక సందేశానికి, బాలయ్య బాబు రేంజ్ ఊరనాటు మాస్ ఇమేజ్‌కు అస్సలు పొంతన కుదురుతుందా, ఈ క్లాస్-మాస్ బ్యాలెన్సింగ్ ఎలా ఉండబోతోందనే సరికొత్త ఆలోచన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కొరటాల మార్క్ సందేశం - బాలయ్య మార్క్ విద్వంసం:

డైరెక్టర్ కొరటాల శివ గత చిత్రాలైన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, దేవర వంటి సినిమాలను గమనిస్తే.. కథలో ఒక బలమైన సామాజిక సమస్య, దానికి తగ్గట్టుగా హీరో పాత్ర చాలా హుందాగా, క్లాస్‌గా సాగుతుంది. కానీ బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ మరియు థియేట్రికల్ స్టామినా పూర్తిగా భిన్నం. ఆయన స్క్రీన్ పైకి వస్తే డైలాగుల తూటాలు పేలాలి, విలన్లు గాల్లోకి లేవాలి. ఇక సమాజానికి మంచి చెప్పాలనే దర్శకుడి తాపత్రయానికి, థియేటర్లలో సీట్లు చింపేయాలనే నందమూరి అభిమానుల అంచనాలకు నడుమ ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి.

20 రోజుల పాటు సాగే ఫైట్ - కొరటాల హోం వర్క్:

ఆగస్టు చివరి వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఏకంగా 20 రోజులకు పైగా షూటింగ్ చేయబోతున్నారట. ఇక దీన్ని బట్టి చూస్తే కొరటాల శివ తన క్లాస్ మెసేజ్‌ను పక్కన పెట్టకుండానే, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్ డోస్‌ను పీక్స్‌కు తీసుకెళ్లినట్లు అర్థమవుతోంది. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో.. సమాజంలో దట్టంగా పేరుకుపోయిన ఒక సమస్యను కార్పెంటర్ ఎలా చెక్కాడనే కోణంలో కొరటాల స్క్రిప్ట్‌పై గట్టిగా కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది.

క్లాస్-మాస్ బ్యాలెన్సింగ్.. సరికొత్త ప్రయోగం:

కొరటాల శివ సినిమాల్లో కేవలం ఫైట్లు మాత్రమే ఉండవు, ఆ ప్రాంతపు జీవన శైలిని, ఆ ఊరి నేపథ్యాన్ని చాలా బలంగా చూపిస్తారు. 'కార్పెంటర్' బ్యాక్‌డ్రాప్‌లో కూడా సామాజిక మార్పును ఆశిస్తూనే, బాలయ్య మార్క్ తొడగొట్టే యాక్షన్‌ను జోడించడం కత్తి మీద సామే.. క్లాస్ డైరెక్టర్ చేతిలో పడితే మాస్ హీరోలు ఏ రేంజ్‌లో మెప్పించగలరో ఇప్పటికే రుజువైంది, ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది.

కథ కంటే కూడా కథా నేపథ్యాన్నే నమ్ముకునే కొరటాల శివ.. దేవర సక్సెస్ తర్వాత మరింత కసిగా ఈ స్క్రిప్ట్‌ను లాక్ చేశారు. మెసేజ్ ఇస్తూనే మాస్ ఆడియన్స్‌కు కావలసిన ఫుల్ మీల్స్ పెట్టడం అందరికీ సాధ్యం కాదు. 20 రోజుల యాక్షన్ బ్లాక్, కొరటాల స్టైల్ ఆలోచనలు కలిసి ఎలా వర్కవుట్ అవుతాయో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం వస్తుందో థియేటర్లలో చూడాల్సిందే.