బాలయ్యతో మూవీ.. అనిరుధ్ పై డౌట్ ఎందుకు?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే కొత్త సినిమా గురించి టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ మొదలైంది.
By: M Prashanth | 6 May 2026 10:12 AM ISTనటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే కొత్త సినిమా గురించి టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎస్ఎల్వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్ట్ కు జస్ట్ అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌పై వస్తున్న వార్తలు మరింత ఆసక్తి పెంచుతున్నాయి.
సాధారణంగా బాలయ్య సినిమాలకు తమన్ సంగీతం అందిస్తుంటారు. అలాగే కొరటాల శివ సినిమాల్లో ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్ పని చేస్తారు. కానీ ఈసారి ఈ ఇద్దరినీ పక్కన పెట్టి తమిళ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వైపు మూవీ యూనిట్ మొగ్గు చూపిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో ట్రెండ్ సెట్టర్ గా ఉన్న అనిరుధ్ ఆ ప్రాజెక్టులోకి వస్తే సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే అనిరుధ్ తన మ్యూజిక్ తో పలు పెద్ద సినిమాలకు కొత్త ఎనర్జీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్స్ ప్రేక్షకులను థియేటర్లలో ఊపేస్తాయని ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే సమయంలో బాలయ్య మాస్ ఇమేజ్ కు అనిరుధ్ స్టైల్ మ్యూజిక్ కలిస్తే అది ఓ కొత్త అనుభూతి అవుతుందనే అభిప్రాయం ఇప్పుడు అభిమానుల్లో కనిపిస్తోంది.
అయితే మరోవైపు ఇంకో చర్చ కూడా జరుగుతోంది. బాలయ్య- తమన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో మ్యూజిక్ పెద్ద ప్లస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి అనిరుధ్ రవిచందర్ ను తీసుకోవడం ఒక రిస్క్ గా భావించే వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య అభిమానులు తమన్ స్టైల్ మాస్ బీట్స్ కు అలవాటు పడిపోయారు. అలాంటి సమయంలో అనిరుధ్ ఎలా డెలివర్ చేస్తారన్నది ఒక డౌట్ గా మారింది.
కానీ అనిరుధ్ ట్రాక్ రికార్డ్ చూస్తే, ఆయన ప్రతి సినిమాకు సెపరేట్ స్టైల్ లో సంగీతం అందించగల స్టామినా ఉన్న కంపోజర్. కథకు తగ్గట్టుగా, హీరో ఇమేజ్ కు సరిపోయేలా మ్యూజిక్ ఇవ్వడంలో ఆయనకు మంచి పేరు ఉంది. దీంతో ఇప్పుడు బాలయ్య- కొరటాల మూవీకి కూడా ఆయన స్పెషల్ అవుట్ పుట్ ఇవ్వగలరని కొందరు సినీ ప్రియులు భావిస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో డౌట్ అక్కర్లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి బాలయ్య పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, కొరటాల రైటింగ్ అండ్ మేకింగ్, అనిరుధ్ సంగీతం కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఆ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో, మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ పేరును ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. అప్పటివరకు ఆ క్రేజీ ప్రాజెక్ట్ పై ఊహాగానాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ఏదేమైనా అనిరుధ్ ఫిక్స్ అయితే.. తొలిసారి బాలయ్య తో వర్క్ చేస్తూ.. తన అవుట్ పుట్ తో ఎంతలా మెప్పిస్తారో అంతా వేచి చూడాలి.
