నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి కనిపించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ భోజనం చేస్తుండగా బాలకృష్ణ సరదాగా మాట్లాడటం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోతో ముగ్గురూ మళ్లీ ఒకే వేదికపై కనిపించాలనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య, ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 8 Nov 2026 4:39 PM ISTనందమూరి కుటుంబం విషయంలో అభిమానులకు .. ఒక కోరిక ఎప్పటి నుంచో ఉంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురూ కలిసి కనిపిస్తే చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ కుటుంబానికి చెందిన హీరోలు కలిసి కనిపిస్తే.. అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. కానీ గత కొంతకాలంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే చోట కనిపించడం చాలా అరుదుగా మారింది. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు.
ఇలాంటి సమయంలో నందమూరి అభిమానులను.. ఆకట్టుకుంటున్న ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చాలా ఆనందంగా కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ భోజనం చేస్తుండగా బాలకృష్ణ ఆయనతో సరదాగా మాట్లాడటం ఈ వీడియోలో ఉంది. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఈ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.
ఈ వీడియోను చూసిన అభిమానులు తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. పాత వీడియోకే ఇంత స్పందన వస్తుంటే, వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక సినిమాలో నటిస్తే బాక్సాఫీస్ దగ్గర భారీ సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మళ్ళీ కలిసి ముందులాగా ఉండడం ఎప్పటికీ జరుగుతుందో అనేది ప్రస్తుతం చాలామందిలో ఉన్న బాధ.
