రజనీతో బాలయ్య.. థియేటర్లు ఏమవుతాయో..?
జైలర్ సూపర్ హిట్ అందుకోగా నెల్సన్ తో జైలర్ 2 చేస్తున్నారు రజనీ. ఇప్పటికే ఆ సినిమా సెట్స్ మీద ఉంది.
By: Ramesh Boddu | 17 Aug 2025 11:36 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలో మన కింగ్ నాగార్జున కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సైమన్ రోల్ లో నాగార్జున స్టైల్ అదిరిపోయింది. ఐతే సినిమా చూసిన అక్కినేని ఫ్యాన్స్ నాగ్ ఈ రోల్ చేయకుండా ఉండాల్సిందని అన్నారు. కానీ నాగార్జున అంతే రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అలా చేయడం ఆయనకు ఇష్టం. ఐతే రజనీతో నాగార్జున స్క్రీన్ షేర్ చేస్తే ఎలా ఉంటుందో చూశారు. ఇక నెక్స్ట్ రజనీతో మన నట సిం హం బాలయ్య బాబు చేస్తున్నాడు.
నెల్సన్ తో జైలర్ 2..
జైలర్ సూపర్ హిట్ అందుకోగా నెల్సన్ తో జైలర్ 2 చేస్తున్నారు రజనీ. ఇప్పటికే ఆ సినిమా సెట్స్ మీద ఉంది. జైలర్ లో ఎలా అయితే స్టార్ క్యామియోస్ సర్ ప్రైజ్ చేశాయో.. ఇప్పుడు జైలర్ 2 లో కూడా అదే రేంజ్ క్యామియోస్ అలరిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా తమిళ సినిమాలో బాలయ్య బాబు మెరవబోతున్నారు. బాలకృష్ణ క్యామియో బ్లాస్ట్ అవుతుందని అంటున్నారు.
తెర మీద స్టార్స్ అది కూడా సీనియర్ హీరోలు కనిపిస్తే ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది. ఆల్రెడీ కూలీతో నాగ్, రజనీల కల్యిక చూశాం. ఇప్పుడు జైలర్ 2లో బాలయ్య, రజనీ కనిపించబోతున్నారు. తెలుగులో బాలయ్య మాస్ మేనియా తెలుసు కాబట్టి నెల్సన్ అందుకు తగినట్టుగానే జైలర్ 2 లో ఆయన పోర్షన్ రెడీ చేస్తారని చెప్పొచ్చు. జైలర్ 2 లో బాలయ్య ఎంట్రీ సీన్ తోనే థియేటర్లు దద్దరిల్లిపోతాయ్ అని చెప్పొచ్చు.
బాలయ్య సినిమాల దూకుడు..
ఇక మరోపక్క బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 తాండవం పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో ఒక సినిమా, క్రిష్ తో ఆదిత్య 999 సినిమాలు చేస్తున్నాడు. ఐతే ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారట బాలయ్య. నవంబర్ నుంచి ఈ సినిమాల రెగ్యులర్ షూట్ మొదలవుతుందట. ఇక మీదట ఏడాదికి నాలుగు సినిమాలు చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్ గా చెప్పారు బాలయ్య.
బాలయ్య కూడా తన సినిమాల దూకుడు పెంచాడు. వరుస సినిమాలు వాటితో సక్సెస్ లు ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందిస్తున్నాయి. ఈ ఇయర్ మొదట్లో డాకు మహారాజ్ తో వచ్చిన బాలయ్య నెక్స్ట్ అఖండ 2 తో మరోసారి బాక్సాఫీస్ పై తన తాండవం చూపించాలని చూస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ కచ్చితంగా రెండు రిలీజ్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట బాలయ్య. వాటితో పాటు రజనీ జైలర్ 2 కూడా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు.
