Begin typing your search above and press return to search.

ఆ ఫ్రాంచైజీలో బాలయ్య.. ప్రచారమే ఎక్కువైందా?

ఒక సినిమా చుట్టూ ఎన్ని వార్తలు వస్తున్నా.. చివరకు అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేసేదే మెయిన్.

By:  M Prashanth   |   21 Oct 2026 10:04 AM IST
ఆ ఫ్రాంచైజీలో బాలయ్య.. ప్రచారమే ఎక్కువైందా?
X

ఒక సినిమా చుట్టూ ఎన్ని వార్తలు వస్తున్నా.. చివరకు అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేసేదే మెయిన్. ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ జైలర్ ఫ్రాంచైజీ విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. మూడో పార్టులో నందమూరి బాలకృష్ణ నటిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన జైలర్-2లో కూడా నటించే అవకాశం వచ్చినా ఆయన ఇంట్రెస్ట్ చూపలేదని గతంలో ప్రచారం జరిగింది.

రజనీకాంత్ లీడ్ రోల్ లో నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. స్టోరీతో పాటు ఇతర భాషల స్టార్ హీరోల గెస్ట్ రోల్స్ కూడా ప్రేక్షకులను ఫుల్ గా ఆకట్టుకున్నాయి. మోహన్‌ లాల్, శివరాజ్‌ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి నటులు కనిపించడం సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా మారింది. ఆ ఫార్ములా రెండో భాగంలోనూ కంటిన్యూ అయింది. దీంతో మూడో పార్టులో ఎవరెవరు కనిపిస్తారనే చర్చ అప్పుడే మొదలైంది.

నిజానికి మూడో పార్టు ఉందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ జైలర్ 2 క్లైమాక్స్ లో హింట్ ఇచ్చినట్లు అంతా చెబుతున్నారు. ఇప్పుడు జైలర్ 3 విషయంలో బాలకృష్ణ పేరు మళ్లీ వినిపిస్తోంది. జైలర్-2లో ఆయన నటిస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. దర్శకుడు నెల్సన్ బాలయ్యతో సంప్రదింపులు జరిపారని, అయితే రోల్ రన్ టైమ్ తక్కువగా ఉండటంతో ఆయన వెనక్కి తగ్గారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ పేరు కూడా ఆ డిబేట్ లో వినిపించింది.

ఇప్పుడు జైలర్-3లో బాలయ్యకు కీలకమైన పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆయన మాస్ ఇమేజ్‌ కు సరిపోయేలా నెల్సన్ స్పెషల్ రోల్ రెడీ చేస్తున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. రజనీకాంత్‌ తో బాలకృష్ణ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే ఇద్దరి అభిమానులకు కూడా అది స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుంది. అయితే బాలయ్య పేరు వినిపిస్తున్నంత మాత్రాన ఆయన నటించడం ఖాయమని చెప్పలేం. గతంలో ‘జైలర్-2’ కోసం సంప్రదింపులు జరిగాయనే వార్తలకే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు.

అలాంటప్పుడు మూడో భాగానికి ఆయన ఓకే చెప్పారని ప్రచారం కూడా ఇప్పటికిప్పుడు నిజమని ఎవరూ నమ్మలేం. మూవీ టీమ్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆ వార్తలను కేవలం రూమర్లుగానే చూడాలి. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో క్యామియే రోల్స్ కూడా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతాయి. అయితే ఆ పాత్రలు నిజంగా ఎంత ప్రభావం చూపిస్తాయన్నది మాత్రం సినిమా థియేటర్స్ లో విడుదలయ్యాకే తెలుస్తుంది.

బాలయ్య విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఆయన నటిస్తే ఎలాంటి పాత్రలో కనిపిస్తారు.. ఎంతసేపు స్క్రీన్ పై ఉంటారు.. అసలు నటిస్తున్నారా అన్నది ఇప్పటికైతే క్లారిటీ లేని విషయమే. అధికారిక ప్రకటన వచ్చే వరకు బాలయ్య జైలర్ 3లో ఉన్నారని చెప్పడం తొందరపాటే అవుతుంది. ఒకవేళ నిజం కాకుంటే మాత్రం.. జైలర్ ఫ్రాంచైజీలో నటసింహం నటిస్తారని, ఆయా రోల్స్ లో కనిపిస్తారని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రచారమే ఎక్కువైందని చెప్పాలి.