Begin typing your search above and press return to search.

బాలయ్య సినిమా ఆలస్యం.. మెగాస్టార్ కు క‌లిసొస్తుందా?

బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఆగస్టులోనే సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. అయితే బాలకృష్ణకు గాయం కావడంతో షూటింగ్ ప్లాన్‌లో మార్పులు తప్పడం లేదని తెలుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Aug 2026 12:45 PM IST
బాలయ్య సినిమా ఆలస్యం.. మెగాస్టార్ కు క‌లిసొస్తుందా?
X

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్ల సినిమాల ప్లానింగ్ అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్‌లో చిన్న మార్పు వచ్చినా.. దాని ఎఫెక్ట్ తర్వాత చేయాల్సిన సినిమాలపై పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ- కొరటాల శివ కాంబినేషన్ సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఆగస్టులోనే సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. అయితే బాలకృష్ణకు గాయం కావడంతో షూటింగ్ ప్లాన్‌లో మార్పులు తప్పడం లేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ వచ్చే సమ్మర్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే లైన్‌లో ఉన్న పలు ప్రాజెక్టులపై కూడా ఈ ఆలస్యం ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది.

ప్ర‌స్తుతం వెంకటేష్‌తో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఆ సినిమా పూర్తైన తర్వాత బాలకృష్ణతో మూవీ చేయాల్సి ఉంది. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తి ఉంది. అయితే బాలయ్య- కొరటాల సినిమా ఆలస్యం కావడంతో అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్‌ను మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి కాంబినేషన్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందనే డిస్క‌ష‌న్ మొదలైంది.

అయితే ఇది కేవలం ఒక సినిమా ఆలస్యమైన వ్యవహారంగా చూడాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోలు, అగ్ర డైరెక్ట‌ర్ కమిట్‌మెంట్స్ వరుసగా ఉండటంతో ఒక సినిమా డేట్ మారితే, దాని వెనుక ఉన్న మొత్తం షెడ్యూల్ చైన్ మారిపోతుంది. ఒక ప్రాజెక్ట్ వాయిదా పడటం వల్ల మరో డైరెక్ట‌ర్ కు కొత్త అవకాశం రావడం, మరో హీరోతో అనుకున్న కాంబినేషన్ ముందుకు లేదా వెనక్కి వెళ్లడం సహజంగా మారుతోంది.

ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లోని కాంబినేషన్ గేమ్ ను ఆసక్తికరంగా మార్చుతోంది. బాలయ్య సినిమా ఆలస్యం అయితే అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబినేషన్‌కు మార్గం సుగమం అవుతుందా? లేక పరిస్థితులు మళ్లీ మారతాయా? అన్నది చూడాలి. మొత్తానికి ఒక స్టార్ హీరో గాయం.. ఒక సినిమా షెడ్యూల్‌ను మాత్రమే కాదు, మరో స్టార్ హీరో సినిమాకు సంబంధించిన ప్లానింగ్‌ను కూడా మార్చే స్థాయిలో ప్రభావం చూపుతోంది. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ల లెక్కలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.