Begin typing your search above and press return to search.

"త్వరగా కోలుకోండి బాబాయ్".. బాలయ్య ఆరోగ్యంపై కళ్యాణ్ రామ్ పోస్ట్!

నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారనే వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.

By:  Madhu Reddy   |   21 July 2026 3:44 PM IST
త్వరగా కోలుకోండి బాబాయ్.. బాలయ్య ఆరోగ్యంపై కళ్యాణ్ రామ్ పోస్ట్!
X

నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారనే వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు బాలయ్యకు ప్రమాదం ఎలా జరిగింది? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. నందమూరి బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. క్రిస్మస్ టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగు ప్రస్తుతం వేగంగా జరుగుతోంది..

అందులో భాగంగానే కాకినాడ పోర్ట్ లో బాలయ్య పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు గోపీచంద్ మలినేని. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా బాలకృష్ణ స్టంట్ చేస్తున్న సమయంలో సడన్గా కాలుజారి కింద పడిపోయారట. వెంటనే స్పందించిన చిత్ర బృందం హుటాహుటిన ఆయనను సమీపంలోని హాస్పిటల్ కి తరలించగా.. పరీక్షించిన వైద్యులు కాలికి చిన్న ఎముక విరిగిందని, ఆయన త్వరగా కోలుకోవాలి అంటే సర్జరీ అవసరమని తెలిపారట.

ఇకపోతే విషయం తెలుసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. తన బాబాయ్ త్వరగా కోలుకోవాలి అంటూ ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. "బాబాయ్ మీరు త్వరగా కోలుకోండి.. మీరు వేగంగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు అత్యంత ఇష్టమైన పనిని చేస్తూ, మీరు అతి త్వరలోనే తిరిగి రంగంలోకి దిగుతారని నాకు నమ్మకం ఉంది"అంటూ పోస్ట్ పంచుకున్నారు కళ్యాణ్ రామ్.

ఇకపోతే మరొకవైపు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ పంచుకున్నారు. "NBK 111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో నందమూరి బాలకృష్ణ గారికి చిన్న ఎముక విరిగింది. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలంటే చిన్న సర్జరీ చేయాల్సి ఉంది. సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం మా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తోంది. ఎవరూ కంగారు పడకండి. త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొనాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం" అంటూ తెలిపారు.

ఇకపోతే మరొకవైపు ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ కూడా ఎక్స్ ఖాతా ద్వారా బాలకృష్ణ గారు మీరు త్వరగా కోలుకోవాలి అంటూ ఒక పోస్ట్ పంచుకున్నారు.

బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న రెండవ చిత్రం ఇది. ఇందులో కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన కాలికి సర్జరీ అవసరం కాబట్టి సర్జరీ పూర్తయిన తర్వాతనే మళ్లీ బాలయ్య సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.