Begin typing your search above and press return to search.

బాలయ్య చెప్పింది తర్వాతి సినిమా డైలాగా?

నందమూరి బాలకృష్ణ స్టేజ్ ఎక్కాడంటే చాలు.. తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకుంటాడనే సంగతి అందరికీ తెలిసిందే. మామూలుగా స్టార్ హీరోల గురించి చుట్టూ ఉన్న వాళ్లే పొగుడుతుంటారు.

By:  Garuda Media   |   29 Nov 2025 11:39 PM IST
బాలయ్య చెప్పింది తర్వాతి సినిమా డైలాగా?
X

నందమూరి బాలకృష్ణ స్టేజ్ ఎక్కాడంటే చాలు.. తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకుంటాడనే సంగతి అందరికీ తెలిసిందే. మామూలుగా స్టార్ హీరోల గురించి చుట్టూ ఉన్న వాళ్లే పొగుడుతుంటారు. కానీ బాలయ్య మాత్రం అందుకు భిన్నం. తాను చేసిన సినిమాల గురించి.. తన చరిత్ర గురించి తనే చెప్పుకుంటూ ఉంటారు. అలాగే తన తండ్రి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు.

ఇటీవల ‘అఖండ-2’ సినిమా హిందీ ప్రమోషన్ కోసం వెళ్లినపుడు అక్కడ కూడా తాను ఎలాంటి సినిమాలు చేశానో.. ఏమేం సాధించానో సుదీర్ఘంగా చెబుతూ వెళ్లారు. తాజాగా ‘అఖండ-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ బాలయ్య ఇదే పని చేశారు. తన ఘనతలను వల్లెవేశారు. ఐతే ఈ క్రమంలో బాలయ్య చెప్పిన ఒక డైలాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందులో ఆయన ‘‘నేనే ఆ చరిత్ర.. నాదే ఆ చరిత్ర’’ అన్న స్టేట్మెంట్‌కు అందరూ ఆశ్చర్యపోయారు.

తనకు తానుగా బాలయ్య ఇలా గొప్పలు పోవడం ఏంటి అంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. ఐతే ఇది బాలయ్య తన గురించి తాను చెప్పుకునే చెప్పిన డైలాగ్ కాదని.. అది తన తర్వాతి సినిమా డైలాగ్ అంటుండడం విశేషం. ‘‘చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ సృష్టించిన చరిత్రను మరలా మరలా తిరగరాసి చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఆ చరిత్ర. నాదే ఆ చరిత్ర’’ అంటూ బాలయ్య కొత్త సినిమాలో డైలాగ్ ఉందట.

ఇంతకుందు బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ తీసిన గోపీచంద్ మలినేని.. బాలయ్య కొత్త చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కే ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం కూడా చేయనున్నాడు. అందులో ఒక పాత్ర చెప్పే డైలాగునే ‘అఖండ-2’లో బాలయ్య సందర్భానుసారంగా తన గురించి చెప్పుకునే క్రమంలో లీక్ చేశాడట. ఇది తెలిసి బాలయ్య ఫ్యాన్స్ ఆ సినిమా విషయంలో ఎగ్జైట్ అవుతున్నారు.