బాలయ్యతో నెవ్వర్ బిఫోర్ అనేలా.. గోపిచంద్ బిగ్ ప్లాన్!
టాలీవుడ్‌లో మాస్ గాడ్‌ఫాదర్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే.
By: M Prashanth | 2 Oct 2025 11:01 PM ISTటాలీవుడ్‌లో మాస్ గాడ్‌ఫాదర్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన వీర సింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హవా చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాంబో ఒక భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపింది.
దీని టైటిల్ తాత్కాలికంగా NBK111గా ఫిక్స్ చేయగా, ఈసారి కాన్సెప్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన దసరా కానుకగా వచ్చింది. ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం రేపుతూ, ఇది ఓ చారిత్రక నేపథ్యం కలిగిన పీరియడ్ డ్రామా అని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు బాలయ్య చేసిన రోల్స్‌లో ఇది పూర్తిగా డిఫరెంట్ అని చెబుతున్నారు.
ఆయన లుక్ చూసిన వెంటనే గూస్‌బంప్స్ వచ్చేస్తాయని మేకర్స్ నమ్మకంతో చెబుతున్నారు. ఈ కొత్త పాత్రలో బాలయ్య ఏ విధంగా కనిపించబోతాడన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక ప్రాజెక్ట్ లాంచ్ కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే అక్టోబర్ 24న ఈ సినిమా శుభారంభం జరగనుందని యూనిట్ ప్రకటించింది. బాలయ్య కెరీర్‌లో ఇది మరపురాని ప్రాజెక్ట్‌గా నిలవాలని మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.
ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తవ్వగా, స్క్రిప్ట్ విషయంలో కూడా ఫైనల్ టచ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి వెనుక ఉన్నది పెద్ద ప్రొడక్షన్ హౌస్‌నే. వెంకట సతీష్ కిళారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ సెట్‌లు, అద్భుతమైన విజువల్స్‌తో ఆడియెన్స్‌ని కొత్త అనుభూతి పంచేందుకు ప్రణాళికలు వేసుకున్నారని తెలుస్తోంది. టెక్నికల్ గా కూడా టాప్ క్రాఫ్ట్స్‌మెన్‌ని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.
గోపీచంద్ మలినేని, బాలయ్య కోసం ప్రత్యేకంగా రాసిన ఈ స్క్రిప్ట్‌లో యాక్షన్, ఎమోషన్, డ్రామా అన్నీ పుష్కలంగా ఉంటాయని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన సినిమాలు మాస్ వర్కౌట్ అయ్యాయి. కాబట్టి ఈసారి హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నందుకు అంచనాలు మరింతగా పెరిగాయి. బాలయ్య ఇంతవరకు చేయని పాత్రలో కనిపించడం, కొత్త లుక్ ట్రై చేయడం సినిమా హైలైట్ అవుతుందని అంటున్నారు.
