బాలయ్య 111.. నెక్స్ట్ దసరా టార్గెట్ ఫిక్స్..!
నందమూరి బాలకృష్ణ అఖండ 2 డిసెంబర్ రిలీజ్ కన్ఫర్మ్ అయినట్టే. ఇక నెక్స్ట్ సినిమాకు కావాల్సిన సన్నాహాలు మొదలయ్యాయి.
By: Ramesh Boddu | 5 Oct 2025 8:00 PM ISTనందమూరి బాలకృష్ణ అఖండ 2 డిసెంబర్ రిలీజ్ కన్ఫర్మ్ అయినట్టే. ఇక నెక్స్ట్ సినిమాకు కావాల్సిన సన్నాహాలు మొదలయ్యాయి. బాలయ్య 111 సినిమాగా వస్తున్న ఈ మూవీని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్నాడు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలకృష్ణతో వీర సింహా రెడ్డి సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ లో జాత్ సినిమా తీసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు గోపీచంద్ మలినేని. ఇక బాలయ్యతో మరోసారి కాంబో ఫిక్స్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్..
బాలయ్య 111 సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే డిఫరెంట్ టేకింగ్ చేయబోతున్నారట. అంతేకాదు ఈ మూవీని కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. గోపీచంద్, బాలయ్య ఈ కాంబో ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ అందిస్తుంది. ఈ కాంబో మళ్లీ రిపీట్ అవ్వడం మరోసారి తెర మీద మాస్ హంగామా జరిగేలా ఉంది.
గోపీచంద్ కూడా ఈ సినిమాను నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించేలా ప్లాన్ చేస్తున్నారట. ఐతే ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు. ఇక ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ మొదట్లో షూటింగ్ స్టార్ట్ చేసి దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అలా అయితే డిసెంబర్ లో అఖండ 2 మళ్లీ 9 నెలల్లోనే బాలకృష్ణ మరో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
బాలకృష్ణ స్పెషల్ ఫోకస్..
బాలయ్య 111 సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య 999 సినిమా కూడా ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారట బాలయ్య. ఈ రెండు సినిమాలు కూడా బాలకృష్ణ స్పెషల్ ఫోకస్ తో చేస్తున్నారట. నందమూరి ఫ్యాన్స్ కైతే బాలకృష్ణ నెక్స్ట్ కమింగ్ మూవీస్ పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాతే బాలయ్య నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది తెలుస్తుంది. ఎలాగు నెక్స్ట్ ఇయర్ ఈ రెండు సినిమాలతోనే బిజీ బిజీగా ఉంటారు బాలకృష్ణ.
బోయపాటి శ్రీను తర్వాత బాలకృష్ణ ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా వాడే అవకాశం ఉన్న డైరెక్టర్ గోపీచంద్. వీర సింహా రెడ్డితో అది ప్రూవ్ అయ్యింది. ఐతే ఈసారి ఈ కాంబో పాన్ ఇండియా ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. మరి ఆ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి.
