హిస్టరీ క్రియేట్ చేసేలా.. N.B.K 111 క్రేజీ అప్డేట్..!
నందమూరి బాలకృష్ణ 111 సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. అఖండ 2 తర్వాత బాలయ్య చేసే సినిమా ఇదే అవుతుందని తెలుస్తుంది.
By: Ramesh Boddu | 31 Oct 2025 1:31 PM ISTనందమూరి బాలకృష్ణ 111 సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. అఖండ 2 తర్వాత బాలయ్య చేసే సినిమా ఇదే అవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ బాలకృష్ణతో వీర సింహా రెడ్డి చేసిన గోపీచంద్ మలినేని ఈసారి బాలకృష్ణతో హిస్టారికల్ సినిమా చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఎన్.బి.కె 111 సినిమా విషయంలో సెట్స్ మీదకు వెళ్లకముందే సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అవుతుంది.
బాలయ్య సినిమాతో ఈసారి పాన్ ఇండియా..
వీర సింహా రెడ్డి తర్వాత సన్నీ డియోల్ తో జాత్ సినిమా తీసి హిందీలో సూపర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్ మలినేని. ఇక నెక్స్ట్ బాలయ్య సినిమాతో ఈసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేయనున్నాడని తెలుస్తుంది. బాలకృష్ణతో చేసే సినిమా కోసం ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్నారట గోపీచంద్ మలినేని. రాజస్థాన్ కోటల్లో తన టీం తో కలిసి లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మామూలుగా తన యాక్షన్ సినిమాలతో ఆడియన్స్ కి మాస్ ట్రీట్ ఇస్తూ వచ్చిన గోపీచంద్ ఈసారి బాలయ్యతో మాస్ బొమ్మే కాదు హిస్టారికల్ కథతో హిస్టరీ క్రియేట్ చేయాలని చూస్తున్నారట. అందుకు తగినట్టుగానే పర్ఫెక్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకున్నారట. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్ కి స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నాడట గోపీచంద్ మలినేని.
గోపీచంద్ మలినేని బాలయ్య హిస్టారికల్ మూవీ..
త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. గోపీచంద్ మలినేని బాలయ్యకు వీరాభిమాని.. అందుకే వీర సింహా రెడ్డితో తన ఫ్యానిజం చూపిస్తున్నాడు. ఇక నెక్స్ట్ మరోసారి ఈ కాంబో సినిమా నెక్స్ట్ లెవెల్ లో రాబోతుంది. ఈ సినిమాతో బాలయ్య కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ టార్గెట్ తో వస్తున్నారని తెలుస్తుంది. బాలయ్య ఈ సినిమాతో పాటుగా ఆదిత్య 999 సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లానింగ్ లో ఉన్నారని టాక్.
బాలయ్యతో గోపీచంద్ చేస్తున్న ఈ సినిమా కోసం భారీ సెటప్ ఏర్పాటు చేస్తున్నారు. ఐతే ఈ సినిమా మిగతా స్టార్ కాస్ట్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. ఆదిత్య 999 కూడా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుందని అన్నారు. ఐతే ఆ సినిమాకు సంబందించిన అప్డేట్ కోసం కూడా నందమూరి ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
బాలయ్య బాబు హిస్టారికల్ టచ్ ఉన్న సినిమాలకు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపిస్తారు. ఆయన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేశారు. ఇప్పుడు గోపీచంద్ తో 111వ సినిమాగా మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నారు. ఐతే గోపీచంద్ ఈ కథను ఫిక్షనల్ కథగా రాసుకున్నాడా లేదా ఏదైనా రిఫరెన్స్ తో మొదలు పెడుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కచ్చితంగా బాలయ్య హిస్టారికల్ మూవీ సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
