బాలయ్య ప్రణాళిక 2026 నుంచి అమల్లోకా!
నటసింహ బాలకృష్ణ కెరీర్ ఆరంభంలో ఏడాది ఆరేడు సినిమాలు రిలీజ్ చేసేవారు. పాత రోజుల్లో మూడు షిప్టుల్లో పని చేయడంతోనే రిలీజ్ లు సాధ్యపడేది.
By: Srikanth Kontham | 9 Aug 2025 1:59 PM ISTనటసింహ బాలకృష్ణ కెరీర్ ఆరంభంలో ఏడాది ఆరేడు సినిమాలు రిలీజ్ చేసేవారు. పాత రోజుల్లో మూడు షిప్టుల్లో పని చేయడంతోనే రిలీజ్ లు సాధ్యపడేది. కాలక్రమంలో మూడు షిప్టుల ట్రెండ్ అన్న ది సీనియ ర్లతోనే ముగిసిపోయింది. ఇక ఆరు సినిమల రిలీజ్ సంగతైతే? ఇప్పటి జనరేషన్ యువత కైతే తెలియనే తెలియదు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కానా కష్టంగా మారిన రోజులివి. స్టార్ హీరోలంతా ఇలా సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ విషయంలో హీరోలు కూడా మారాలని చాలా సందర్భాల్లో అనుకున్నారు.
ఏడాదికి నాలుగు సినిమాలు:
బహిరంగ ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఏ హీరో ఆచరణని అమలులోకి తీసుకురాలేదు. ప్రకటన కేవలం అక్కడికే పరిమితమైంది. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడం కూడా చాలా మంది హీరోలకు సాధ్య పడటం లేదు. కొంతలో కొంతైనా సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి వారే ఉత్తమంగా కనిపిస్తున్నారు. వీలైనంత వేగంగా షూటింగ్ లు పూర్తి చేసి సినిమాలు రిలీజ్ చేయ గల్గుతు న్నారు. మిగతా హీరోలు కూడా ఏడాదికి రెండు సినిమాలైనా రిలీజ్ చేయయగల్గితే పరిశ్రమకు కలిసొస్తుందని...నిర్మాతకు లాభదాయకంగా ఉంటుందని భావించినా అది జరగడం లేదు.
బాలయ్య పాన్ ఇండియా సినిమా:
దీనికి సంబంధించి నిర్మాతల సంఘం హీరోలతో పలు భేటీలు నిర్వహించినా? అది అక్కడికే పరిమి త మైంది. హీరో ఒక సినిమాకు డేట్లు కేటాయించిన తర్వాత మరో సినిమాకు కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. పాన్ ఇండియా మోజులో పడిన తర్వాత సన్నివేశం పూర్తి భిన్నంగా ఉంది. ఆ సినిమా కోసమే సంవత్సరాల పాటు పని చేస్తున్నారు. మొదలైన పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయ్యే వరకూ మరో సిని మాకు కమిట్ అయ్యే పరిస్థితి లేకుండా పోతుంది. 'అఖండ 2' తో బాలకృష్ణ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. అలాగని బాలయ్య ఈ సినిమాకే బాండ్ అవ్వలేదు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే కొత్త కథలు వింటూ వాటిని ఒకే చేస్తున్నారు. అతి త్వరలోనే గోపీచంద్ మలినేనితో బాలయ్య కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఇంతలోనే బాలయ్య మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏడాదికి నాలుగు సినిమాలైనా నిర్మా లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని భావిస్తున్నారు.
అభిమానులకు గుడ్ న్యూస్:
ఇటీవల కొంత మంది నిర్మాతలు ఆయన్ని కలిసి ఇండస్ట్రీ సమస్యలు సహా తాజా పరిస్థితిని వివరించారు. దీంతో బాలయ్య కూడా సినిమాలు చేసే విధానం మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నాలుగు సినిమాల అంశాన్ని వారి వద్ద ప్రస్తావించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలయ్య అంటే మాటకే పరిమితం చేయరు. ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తారు. ఇచ్చిన మాటను వచ్చే ఏడాది నుంచే అమలులోకి తీసుకు రావాలనుకుంటున్నారుట. ఇది నందమూరి అభిమానులకు మంచి శుభవార్తే.
