నాలుగు సార్లు సెంచరీ..డబుల్ హ్యాట్రిక్ దగ్గర్లో!
ఐదేళ్లగా నటసింహ బాలకృష్ణ కు ఎదురేలేదు. చేసిన సినిమా బ్లాక్ బస్టరే. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' తో వరుసగా నాలుగు హిట్లు అందుకున్నారు.
By: Srikanth Kontham | 6 Sept 2025 10:00 AM ISTఐదేళ్లగా నటసింహ బాలకృష్ణ కు ఎదురేలేదు. చేసిన సినిమా బ్లాక్ బస్టరే. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' తో వరుసగా నాలుగు హిట్లు అందుకున్నారు. నాలుగు 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలే. వరుసగా నాలుగు సార్లు సెంచరీ కొట్టిన సీనియర్ గానూ బాలయ్య పేరిట ఇదో రికార్డు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి సమకాలీకులు ఉన్నా? వాళ్లు కూడా నమోదు చేయని లైనప్ ని బాలయ్య నమోదు చేసాడు. దీంతో బాలయ్య గురి ఇప్పుడు డబుల్ హ్యాక్రిక్ పై ఉంది.
బాలయ్యతో రికార్డుల మోతేనా:
'అఖండ2 'తో పాన్ ఇండియాని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా వంద కోట్లు కాదు? బాల య్య కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా రికార్డు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సింహం అభిమానుల అంచనాలైతే ఊహకందని విధంగా ఉన్నాయి. బాలయ్య నుంచి రిలీజ్ అవు తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో? బాక్సాఫీస్ లెక్క సాధ్యమేనా అంటున్నారు. సినిమా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. భారీ సంఖ్యలో పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది.
మరోసారి అదే కాంబినేషన్ లో:
అనుకున్న సమయంలో పనులు పూర్తయితే డిసెంబర్ లోనే సింహం గర్జన మొదలవుతుంది. తప్పితే సంక్రాంతి కానుకగా పందెం కోడిలా బరిలోకి దిగుతారు. ఈ సినిమా అనంతరం బాలయ్య గోపీచంద్ మలినని దర్శకత్వంలో మరో సినిమా చేస్తారు. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 134 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ నేప థ్యంలోనే మరోసారి బాలయ్య పక్తు కమర్శియల్ డైరెక్టర్ ని రంగంలోకి దించుతున్నారు.
అదే కాన్పిడెన్స్ తో:
గోపీచంద్ మలినేని ట్రాక్ రికార్డు కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఇంత వరకూ కెరీర్ లో చేసిన ఎనిమిది సినిమాల్లో ఏడు విజయాలే. ఇటీవలే `జాట్` తో బాలీవుడ్ కి తన శైలిని పరిచయం చేసాడు. అక్కడా సక్సస్ అందుకున్నాడు. బాలీవుడ్ కి అసలైన యాక్షన్ ని పరిచయం చేసిన దర్శకుడిగా గోపీ పేరు మారుమ్రోగిపోతుంది. ఇవన్నీ బాలయ్య తదుపరి చిత్రానికి కలిసొచ్చే అంశాలే. ఈ సినిమా కూడా అనుకున్నట్లు సక్సెస్ అయితే బాలయ్య కెరీర్ లో తొలి డబుల్ హ్యాట్రిక్ నమోదవుతుంది. ఈ విషయంలో నందమూరి అభిమానులు అంతే కాన్పిడెంట్ గా ఉన్నారు.
