బాలీవుడ్ లో ఒక సిగ్నేచర్ వేసొచ్చా.. వాళ్లకి దిమ్మతిరిగిపోయింది..!
ఎప్పుడు మైక్ అందుకున్నా బాలయ్య సిగ్నేచర్ ఉండాల్సిందే. ఆ మైక్ కూడా అలా పైకి ఎగరేసి తీసుకోకపోతే ఫీల్ అవుతుందేమో అనేలా ఉంటుంది.
By: Ramesh Boddu | 29 Nov 2025 11:28 AM ISTబాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా ఈవెంట్ లో బాలయ్య ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ ని ఉత్తేజపరచింది. ముఖ్యంగా ముంబైలో అఖండ 2 సినిమా ప్రమోషన్స్ గురించి బాలయ్య చెబుతూ ముంబైలో ఈవెంట్ లో మైక్ తిప్పితే అందరు కంగారు పడిపోయారు.. అక్కడ అందరికీ దిమ్మ తిరిగిపోయింది.. అక్కడ ఒక సిగ్నేచర్ వేసి వచ్చా.. ఆ ఈవెంట్ లో ఆరు గంటలు ప్రయాణం చేసి సోలాపూర్ నుంచి ఫ్యాన్స్ వచ్చారు. మనకు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు. చాలు ఈ జన్మకి.. ఇంకా చేసుకుంటూ వెళ్తా ఇలానే మంచి మంచి సినిమాలు చేస్తానని అన్నారు బాలకృష్ణ.
మైక్ తో బాలయ్య సిగ్నేచర్..
ఎప్పుడు మైక్ అందుకున్నా బాలయ్య సిగ్నేచర్ ఉండాల్సిందే. ఆ మైక్ కూడా అలా పైకి ఎగరేసి తీసుకోకపోతే ఫీల్ అవుతుందేమో అనేలా ఉంటుంది. ప్రతి హీరోకి ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. అలానే ప్రతి ఈవెంట్ లో బాలకృష్ణ అలా స్టైల్ గా మైక్ ని తిప్పి పట్టుకుని స్పీచ్ మొదలు పెడతారు. అది ఫ్యాన్స్ కోసమే అయినా అది ఎప్పుడు మిస్ అయ్యి కిందపడిన సందర్భం లేదు. ఇక ఆయన మైక్ తీసుకుని ఇచ్చే స్పీచ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా అఖండ 2 సినిమా కోసం బాలయ్య స్పెషల్ ఫోకస్ తో ఈ ప్రమోషన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా అంటే అంచనాలు ఎప్పుడు తగ్గదు. ఐతే అఖండ తర్వాత ఆ సినిమా సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 తో మరోసారి ఈ కాంబినేషన్ స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్.. ముఖ్యంగా అఘోరా పాత్రలో అదరగొట్టేస్తారని తెలుస్తుంది.
అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా అటెంప్ట్..
ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న అఖండ 2 సినిమాలో సం యుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అఖండ 2లో థమన్ మ్యూజిక్ మరోసారి బాలయ్య మీద అతనికి ఉన్న ప్రేమ చూపించేలా ఉంటుందని తెలుస్తుంది. అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు.
బాలకృష్ణతో మిగతా ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఆయన ఎనర్జీని సరిగా వాడుకోవాలంటే అది బోయపాటి శ్రీను మాత్రమే అనేలా ఆయన టేకింగ్ ఉంటుంది. ఐతే అఖండ 2 పై ఉన్న అంచనాలకు ఈ సినిమాలో మరోసారి బాలయ్య ఉగ్రరూపాన్ని చూపించబోతున్నారట. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న అఖండ 2 సినిమాపై నందమూరి ఫ్యాన్స్ చాలా హోప్స్ తో ఉన్నారు. ట్రైలర్ ఇంప్రెస్ చేయడం డివోషనల్ టచ్ ఉండటంతో అఖండ 2 పై నేషనల్ వైడ్ గా కూడా మంచి బజ్ ఏర్పడింది.
