ఎన్టీఆర్ నో చెప్పారు...రెండు బ్లాక్ బస్టర్స్ బాలయ్య మిస్ !
బాలయ్య ప్రస్తుతం ఉన్న టాప్ ఫోర్ సీనియర్ హీరోలందరిలోనూ అత్యంత సీనియర్. ఆయన 1974 నుంచే సినీ రంగంలోకి ప్రవేశించి క్రమం తప్పకుండా ప్రతీ ఏడాది నటిస్తూనే ఉన్నారు. ఆయన తొలి సినిమా తాతమ్మ కల హిట్.
By: Satya P | 10 Jun 2026 11:55 PM ISTబాలయ్య ప్రస్తుతం ఉన్న టాప్ ఫోర్ సీనియర్ హీరోలందరిలోనూ అత్యంత సీనియర్. ఆయన 1974 నుంచే సినీ రంగంలోకి ప్రవేశించి క్రమం తప్పకుండా ప్రతీ ఏడాది నటిస్తూనే ఉన్నారు. ఆయన తొలి సినిమా తాతమ్మ కల హిట్. ఆ తరువాత 1975లో వచ్చిన రామ్ రహీం కూడా హిట్. ఇక అదే ఏడాది ఎన్టీఆర్ తో కలసి నటించిన అన్నదమ్ముల అనుబంధం మూవీ సూపర్ హిట్. ఇక 1977 లో దానవీర శూర కర్ణ లో అభిమాన్యుడుగా బాలయ్య వేసిన పాత్రకు హైలెట్ అయింది. 1978లో అక్బర్ సలీం అనార్కలి మూవీ, 1979లో శ్రీ మద్విరాటపర్వం, ఆ తరువాత శ్రీ తిరుపతి వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం, రౌడీ రాముడు కొంటె క్రిష్ణుడు, సింహం నవ్వింది. అనురాగ దేవత ఇలా కంటిన్యూస్ గా తండ్రితోనే ఏకంగా 12 దాకా సినిమాలు వేసి బాలయ్య వరల్డ్ రికార్డుని క్రియేట్ చేశారు. అంతే కాదు తండ్రి దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
యమగోలలో హీరోగా :
ఇక దానవీర శూర కర్ణ సూపర్ హిట్ కావడంతో పల్లవీ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాత ఎస్ వెంకటరత్నం బాలయ్య హీరోగా ఎన్టీఆర్ ని యముడుగా ఒక సినిమాను ప్లాన్ చేశారు. ఆ మూవీయే యమగోల. దీని మీద ఆయన ఎన్టీఆర్ తో చర్చించారు. అయితే బాలయ్య సొంత నిర్మాణ సంస్థ రామక్రిష్ణా స్టూడియోస్ లో తప్పించి బయట సినిమాలు చేయరని ఎన్టీఆర్ కచ్చితంగా చెప్పేశారు. అంతే కాదు యమగోలలో హీరో తానే వేస్తాను అని చెప్పారు. ఇక యముడు పాత్ర కోసం విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణని తీసుకోవాలని ఆయనే సూచించారు. అలా తయారైందే యమగోల. 1977లో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఈ మూవీలో బాలయ్య హీరోగా వేసి ఉంటే ఆ హిట్ మూవీ ఆయన ఖాతాలో పడేది అని అంటారు. అంతే కాదు చిన్న వయసులోనే స్టార్ డం సాధించేవారు అని అంటారు.
శివరంజని మూవీ కోసం :
ఇక 1978లో వచ్చిన శివరంజని మూవీలో కూడా హీరో పాత్ర కోసం మొదట అనుకున్నది బాలక్రిష్ణనే అన్నది చాలా మందికి తెలియదు. ఈ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు బాలయ్యను ఫుల్ లెంగ్త్ హీరోగా తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా తన దర్శకత్వంలో పరిచయం చేయాలని ఉత్సాహపడ్డారని చెబుతారు. అప్పట్లో ఆయన ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే వంటి సూపర్ హిట్ మూవీ తీసి పెద్దాయన దృష్టిలో ఉన్నారు. ఈ సాన్నిహిత్యంతో ఆయన శివరంజని కధ చెప్పి బాలయ్యను హీరోగా తమ సినిమాలో తీసుకుంటామని అడిగారని అంటారు. దానికి కూడా సీనియర్ ఎన్టీఆర్ నో చెప్పారని బాలయ్య చదువుకుంటున్నారని అన్నారని చెబుతారు. అంతే కాదు బయట నిర్మాణ సంస్థలలో బాలయ్యను ఇప్పట్లో నటింపచేసే ఉద్దేశ్యం లేదని కూడా పెద్దాయన చెప్పేశారుట. అలా శివరంజని మూవీలో బాలయ్య హీరోగా నటించలేకపోయారు. ఆ మూవీలో హరిప్రసాద్ హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
అప్పటిదాకా వెయింటింగ్ :
ఇక ఎన్టీఆర్ 1982లో పార్టీ పెట్టి గెలిచిన తరువాత ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ తరువాతనే ఆయనతో సినిమాలు తీయాలని ఎదురు చూసిన నిర్మాతలకు బాలయ్యతో తీయాలని ఎన్టీఆర్ స్వయంగా చెప్పడంతో 1984లో పీతాంబరం నిర్మాతగా సాహసమే జీవితం బాలయ్య సోలోగా హీరోగా రిలీజ్ అయింది. అది లగాయితూ బాలయ్య శకం మొదలైంది. మొత్తం మీద చూస్తే బాలయ్య ఫ్లాష్ బ్యాక్ లో రెండు బ్లాక్ బస్టర్లు మిస్ చేసుకున్నారని అంటున్నారు.
