Begin typing your search above and press return to search.

ద‌స‌రాకి సింహం డ‌బుల్ ధ‌మాకా!

న‌ట‌సింహ బాల‌కృష్ణ డ‌బుల్ హ్యాట్రిక్ దిశ‌గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు విజ‌యాల‌తో పుల్ స్వింగ్ లో ఉన్నారు.

By:  Srikanth Kontham   |   13 Sept 2025 12:11 PM IST
ద‌స‌రాకి సింహం డ‌బుల్ ధ‌మాకా!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ డ‌బుల్ హ్యాట్రిక్ దిశ‌గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు విజ‌యాల‌తో పుల్ స్వింగ్ లో ఉన్నారు. ఐద‌వ విజ‌యం `అఖండ 2` రూపంలో కొట్టేస్తాను అన్న ధీమాతో ఉన్నారు. ఆ సినిమాపై అంచ‌నాలు అంతే బ‌లంగా ఉన్నాయి. ఇది బాల‌కృష్ణ‌కు 110వ చిత్రం కావ‌డం విశేషం. త‌దుప‌రి 111, 112వ చిత్రాల‌తో కూడా హిట్లు అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే 111వ చిత్రం గోపీచంద్ మ‌లినేనితో లాక్ అయింది. బాల‌య్య మాస్ ఇమేజ్ కు గోపీ మాస్ యాంగిల్ తోడైతే? విధ్వంసం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

రొటీన్ కు భిన్నంగా ట్రై చేస్తున్నారా:

ఇటీవ‌లే `జాట్` తో కూడా ఆయ‌న మంచి దూకుడు మీద ఉన్నారన్న‌ది అర్ద‌మైంది. మేకింగ్ ఆఫ్ యాక్ష‌న్ లో కూడా కొత్త ప‌ద్ద‌త‌ని అవ‌లంబిస్తున్నారు. హీరో పాత్ర‌ను మ‌రింత స్ట్రాంగ్ గా చెప్ప‌డం అల‌వాటు చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య రోల్ ఊహ‌కి అంద‌డం లేదు. అలాగ‌ని రొటీన్ క‌థ‌లా కాకుండా ఓ కొత్త పాయింట్ తోనే ట్రై చేస్తున్నాడీసారి. భారీ యాక్ష‌న్ కి ఓ ఎపిక్ స్టోరీ ని ముడిపెడుతున్న‌ట్లు లీకులందుతున్నాయి. బాల‌య్య మునుప‌టి చిత్రాల‌న్నింకంటే శ‌క్తివంత‌మైన పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని వినిపిస్తోంది. ద‌సరా కానుక‌గా చిత్రాన్ని లాంచ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

రెండు ఒకేసారి ప‌ట్టాలెక్కుతాయా:

స‌రిగ్గా ఇదే ద‌స‌రాకి బాల‌య్య అభిమానులకు మ‌రో గుడ్ న్యూస్ కూడా చెప్ప‌బోతున్నారు? అన్న‌ది తాజా సచారం. ఎన్ బీకే 112వ చిత్రం కూడా లాక్ అయిందంటున్నారు. ఆ చిత్రానికి బాల‌య్య క్రిష్ ని డైరెక్ట‌ర్ గాపైనల్ చేసిన‌ట్లు వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి బాల‌య్య ద‌స‌రా సంద‌ర్భంగా అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని స‌మాచారం. ఇలా ద‌సరాకి బాల‌య్య అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా ప్లాప్ చేసారు. ప్ర‌క‌ట‌న ఒక్క‌టే కాదు గోపీచంద్ సినిమాతో పాటు క్రిష్ చిత్రాన్ని కూడా ఏక కాలంలో చిత్రీక‌ర‌ణ ప్రారంభిచాల‌ని బాల‌య్య భావిస్తున్నారుట‌.

అంత‌టా అదే టాపిక్:

రెండు చిత్రాలు కొత్త ఏడాదిలోనే విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి` త‌ర్వా త ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా ఉంటుంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కానీ అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ప్ర‌చారంగానే హైలైట్ అయింది. కానీ ఆ ప్ర‌చారం నిజ‌మ‌వ్వ‌డానికి 2025 వేదిక అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. కొన్ని రోజులుగా ఇద్ద‌రి కాంబోలో సినిమాంటూ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అందుకు ద‌సరా పుల్ స్టాప్ పెట్టే అవ‌కాశం అంతే బ‌లంగా క‌నిపిస్తోందని ఫిలిం స‌ర్కిల్స్ లోనూ పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది.