బాలయ్య డ్యూయల్ షేడ్స్.. సెకండాఫ్‌లో రాజుగా ఊచకోత!
ఇప్పటికే రిలీజైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా బయటకు వస్తున్న కథా విశేషాలు అంచనాలను మరింత పెంచుతున్నా యి.
By: Sravani Lakshmi Srungarapu | 25 May 2026 12:00 AM ISTటాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ, కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌కు తనదైన ముద్ర వేసుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే రిలీజైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా బయటకు వస్తున్న కథా విశేషాలు అంచనాలను మరింత పెంచుతున్నా యి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య పాత్రను రెండు భిన్నమైన షేడ్స్‌లో డిజైన్ చేశారన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమాచారం ప్రకారం సినిమాలో ఒకటి ప్రస్తుత కాలానికి చెందిన పవర్‌ఫుల్ పాత్ర కాగా, మరొకటి భారీ ఫ్లాష్ బ్యాక్‌లో కనిపించే రాజసంగా ఉండే యువరాజు లేదా రాజు తరహా పాత్ర అని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. గోపీచంద్ మలినేని ఈ ఫ్లాష్ బ్యాక్‌ను కేవలం యాక్షన్ కోసమే కాకుండా, బలమైన ఎమోషన్స్ తో నింపుతున్నారని సమాచారం. రాజ్యం, కుటుంబం, త్యాగం, ప్రతీకారం వంటి ఎలిమెంట్స్‌తో ఈ ట్రాక్ సాగుతుందని, ఇందులో బాలయ్య నటన మరోసారి ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్య లుక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కనిపించిన రాజసం, యుద్ధ నేపథ్యం, సామ్రాజ్య వాతావరణం చూస్తుంటే, ఈ సినిమా సాధారణ కమర్షియల్ యాక్షన్ డ్రామా కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ సెట్స్, వార్ ఎపిసోడ్స్, పీరియాడిక్ టచ్‌తో ఈ సినిమాను డైరెక్టర్ గ్రాండ్ విజువల్ స్పెక్టకల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. ముఖ్యంగా సినిమాలో ఈ డ్యూయల్ ఎమోషనల్ ట్రాక్ సినిమాకు ప్రధాన బలమవుతుందని అంటున్నారు.
అదే సమయంలో S. తమన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇప్పటికే రెండు ట్యూన్స్‌ను తమన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. గతంలో బాలయ్య సినిమాలకు తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా థియేటర్లలో ఊపు తీసుకొచ్చిందో తెలిసిందే. ఈసారి పీరియాడిక్ ఎలిమెంట్స్, యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ వంటి అంశాల కారణంగా బీజీఎంకి మరింత ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఎలివేషన్ సీన్స్‌కు తమన్ సంగీతం ప్రత్యేక బలం కానుందని అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు.
ఇక వీర సింహారెడ్డి తర్వాత బాలయ్య- గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరసింహారెడ్డితో బాక్సాఫీస్ వద్ద మాస్ హంగామా సృష్టించిన ఈ కాంబో, ఈసారి మరింత భారీ స్కేల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ట్రీట్ ఇచ్చిన గోపీచంద్, ఈసారి అదే మాస్‌కు బలమైన ఎమోషన్‌ను జోడిస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి త్వరలోనే మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ వచ్చే అవకాశముంది.
